కృష్ణ వంశి( Krishna Vamsi ) రంగమార్తాండ సినిమా ( Rangamarthanda movie )విడుదల అయినా తర్వాత అందరు ఈ సినిమా గురించే మాట్లాడుతున్నారు.ఈ చిత్రం విజయం సాదించింది పరాజయం పాలయ్యింది అనే అంశాలను పక్కన పెడితే ఒక మంచి చిత్రం అని మాత్రం చెప్పుకోవచ్చు.
ఇక కృష్ణ వంశి తో దాదాపు పాతికేళ్ల తర్వాత అతడి భార్య, నటి అయిన రమ్య కృష్ణ( Ramya Krishna ) మరోమారు అయన సినిమాలో కనిపించారు.మరి చంద్ర లేఖ సినిమాలో మొదటి సారి కనిపించి దాదాపు పాతికేళ్ల పాటు ఎందుకు గ్యాప్ తీసుకున్నారు అనేది పెద్ద ప్రశ్న.
చంద్ర లేఖ సినిమాలో నటించిన తర్వాత కొన్నాళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట 2003 లో సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకొని సెటిల్ అయ్యారు.
వీరి వివాహ బంధం పై ఎన్నో అనుమానాలు వస్తూనే ఉన్న రంగమార్తాండ సినిమాతో ఆ అనుమానాలన్నీ పటాపంచలు అయినట్టే.అయితే అనుమానాలు, ప్రశ్నలు ఎలా ఉన్న కూడా కృష్ణ వంశి సినిమాల్లో కూడా ఎప్పుడు రమ్యకృష్ణ కనిపించక పోవడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూర్చింది.ఇక రమ్య కృష్ణ ను సైతం కృష్ణ వంశి తన రంగమార్తాండ సినిమాలో నటించమని మొదట అడగలేదు అని తెలుస్తుంది.
కానీ పాత్రా పండాలి అంటే మంచి నటి అవసరం అని అది కేవలం తనతోనే సాధ్యం అవుతుంది అని భావించిన రమ్య కృష్ణ తనకు తానుగా ఈ చిత్రంలో నటించడానికి ముందుకు వచ్చిందట.
ఈ విషయాలన్నీ రమ్యకృష్ణ తన ఇంటర్వ్యూ లో చెప్పారు.కృష్ణ వంశి ని తానెప్పుడూ ఒక కమర్షియల్ సినిమా తీసి ఫామ్ లోకి రమ్మని చెప్తానని కానీ కృష్ణ వంశి ఎపుడు తనకు ఏం కావాలో అదే తీస్తాడు అని, ఎవరి మాట వినరు అని చెప్పుకచ్చారు.ఇక ఆరేళ్లుగా సినిమా కోసం ఎంతో కష్టపడినా రంగమార్తాండ తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిన సినిమా గా భావిస్తున్నారు.
ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా రావడం ప్రేక్షకులతో పాటు వారి అభిమానులకు కూడా ఎంతో మంచి విషయం అనే చెప్పవచ్చు.పాతికేళ్ల ఈ గ్యాప్ ఉందన్న మాటే కానీ మధ్యలో నితిన్ హీరో గా నటించిన శ్రీ ఆంజనేయం సినిమాలో క్యామియో రోల్ లో నటించారు రమ్య కృష్ణ.