టాలీవుడ్ హీరోయిన్ ఇండియా స్టార్ ప్రభాస్( Prabhas ) గురించి ఎంత చెప్పిన తక్కువే అని చెప్పాలి.ఎందుకంటే హీరోగా ఒక వైపు సినిమాలలో రాణిస్తూనే మరొకవైపు గొప్ప గొప్ప పనులు చేస్తూ తన గొప్ప మనసును చాటుకుంటున్నారు.
కానీ ఆ విషయం బయటకు పెద్దగా తెలియకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారు.అచ్చం తన పెద్ద నాన్న రెబల్‌స్టార్ కృష్ణంరాజు( Krishnam Raju ) లాగే ప్రభాస్ కూడా సేవాకార్యక్రమాలు చేస్తున్నాడు.
ఇప్పుడు పెద్దనాన్న కల నెరవేర్చబోతున్నాడు అదికూడా పేదల కోసమట.కాగా ప్రభాస్ కుడిచేత్తే చేసే సాయం ఎడమ చేతికి కూడా తెలియదు.
అదేవిధంగా ప్రభాస్ నటుడిగా ఎదగడానికి వెనకుండి నడిపించిన కృష్ణం రాజు కూడా సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండేవారు.

ఇక ఆయన నట వారసుడిగా నేడు పాన్ ఇండియా స్టార్‌గా సినీ ప్రేక్షకులను ఉర్రూతలు ఊపేస్తున్నారు ప్రభాస్.ఒకవైపు సినిమాలు చేస్తూనే ఆపదలో ఉన్న వారికి సాయం చేస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నారు.త్వరలో ప్రభాస్ సపోర్టుతో రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి( Shyamala Devi ) కలిసి ఒక హాస్పిటల్ నిర్మించి పేదలకు వైద్యం అందించాలనుకుంటున్నారట.
ఇదే విషయం గురించి శ్యామలాదేవి స్పందిస్తూ.మధుమేహం భారినపడి గ్రామీణ ప్రాంతాల్లో అనేకమంది పేదలు కాళ్లు, చేతి వేళ్లు కోల్పోవడం చూసి కృష్ణంరాజు చలించిపోయేవారరు.ఈ ఘటనలు చూసి చలించిపోయిన ఆయన ఏదోరంగా తన ప్రాంతం లోని ప్రజలకు మధుమేహంపై అవగాహన కల్పించి ఈ వ్యాధి బారిన పడకుండా పేదలు జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు చేపట్టారు.యూకే ఇండియా ఫౌండేషన్ అనే సంస్థ ద్వారా కృష్ణం రాజుకు వీరాభిమాని అయిన డాక్టర్ వేణు కవతప్, 20 మంది అపోలో వైద్యుల బృందం ఆధ్వర్యంలో భీమవరం చుట్టుపక్కల ప్రాంతంలోని షుగర్ బాధితులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆమె తెలిపారు.

ఇప్పటికే రెండు సార్లు క్యాంపులు నిర్వహించినట్లు ఆమె తెలిపారు.ఈ విషయంలో ప్రభాస్ కు తన వంతు సహాయం చేస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు.త్వరలో ఒక ఆసుపత్రిని నిర్మించి భారతదేశం లోని ఏ ప్రాంతం వారైనా వచ్చి ఉచితంగా వైద్యం పొందేలా సకల సౌకర్యాలతో హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని శ్యామలాదేవి తెలిపారు.దీనికి ప్రభాస్ మద్దతు కూడా ఉంటుందని ఆమె ఏన్నారు.
ఇది కృష్ణంరాజు కోరిక అని తెలిపారు.కాగా ప్రభాస్ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారు.కరోనా సమయంలో రూ.4.5 కోట్ల సాయాన్ని విరాళంగా ప్రకటించారాయన.అందులో రూ.3కోట్లు పీఎం నిధికి ఇవ్వగా.రూ.50 లక్షలు చొప్పున కోటి రూపాయలను రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రభాస్ ఇచ్చారు.అంతేకాదు మరో రూ.50 లక్షలను చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌కి ఇచ్చి సినిమా ఇండస్ట్రీలోని కళాకారులకు తోడ్పాటు అందించారు ప్రభాస్.దీంతో పాటుగా ఏటా 100మంది విద్యార్థులకు పాఠశాలల్లో ఫీజులు, దస్తులు, పుస్తకాలు, వారికి కావాల్సిన ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారట.
అంతేకాదు షుటింగ్ సమయంలో తన కేరవ్యాన్, సిబ్బంది ఖర్చులను ప్రభాసే భరిస్తాడట.గత ఏడాది ఏపీ లోని విజయవాడ, హైదరాబాద్ లో వరదలు సంభవించినప్పుడు ప్రభాస్ రూ.2 కోట్లను ఒక్కో కోటి చొప్పున రెండు తెలుగు రాష్ట్రాలను ఇచ్చిన విషయం తెలిసిందే.ప్రభాస్ ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న ఈ విషయాలను బయటకు తెలియకూడదు అని కోరుకుంటాడు.
అందుకే తన కుడిచేత్తో చేసే సహాయం కూడా ఎడమ చేతికి తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు ప్రభాస్.