1.కెసిఆర్ విమర్శలు

కాంగ్రెస్ పార్టీతో జాగ్రత్తగా ఉండకపోతే వైకుంఠం పెద్ద పాము మింగినట్టే ఉంటుందని బీఆర్ఎస్ తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.
2.అమిత్ షా తెలంగాణ పర్యటనలో మార్పులు
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన షెడ్యూల్ లో మార్పులు చోటు చేసుకుంది.ఈ రాత్రికి హైదరాబాద్ కు అమిత్ షా రావాల్సి ఉండగా, రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఆయన హైదరాబాద్ రానున్నారు.
3.తెలంగాణపై రాహుల్ గాంధీ కామెంట్స్

తెలంగాణలో కాంగ్రెస్ తుఫాన్ రాబోతుందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు.తెలంగాణతో నాకున్నది రక్తసంబంధం అని రాహుల్ తెలంగాణ పర్యటనలో రాహుల్ వ్యాఖ్యానించారు.
4.కాంగ్రెస్ పై హరీష్ రావు కామెంట్స్
మీకు ఇచ్చే ముఖం లేదు, తెచ్చే ముఖం లేదు అంటూ ప్రతిపక్షాలను ఉద్దేశించి తెలంగాణ మంత్రి ,బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు.
5.ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం : మల్లికార్జున ఖర్గే

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసి చూపిస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.
6.బీ ఆర్ ఎస్ కు ఫిలిం ఛాంబర్ మద్దతు
బీఆర్ఎస్ పార్టీకి సీఎం కేసీఆర్ కు మద్దతు తెలపాలని నిర్ణయించుకున్నట్లు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు రామకృష్ణ గౌడ్ తెలిపారు.
7.చిరంజీవి పవన్ కళ్యాణ్ పై కేఏ పాల్ విమర్శలు

ప్యాకేజీ స్టార్ కు 1000 కోట్లు ఇచ్చారని , కాపులను టిడిపికి అమ్మేసారని 2009లో చిరంజీవి, ఇప్పుడు పవన్ కాపులను అమ్మేసారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు.
8.మంత్రి శ్రీనివాస్ గౌడ్ నామినేషన్ పై హైకోర్టులో పిటిషన్
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల నామినేషన్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో రాఘవేంద్ర రాజు అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.
9.మంత్రి సత్యవతి రాథోడ్ పై కేసు నమోదు

తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ పై కేసు నమోదయింది .ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ మంత్రిపై కేసు నమోదు అయింది.
10.కాంగ్రెస్ పై ఎమ్మెల్సీ కవిత విమర్శలు
గ్యారంటీలకు గాంధీలు, క్షమాపణలకు బుంట్రోతులా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పై విమర్శలు చేశారు.తెలంగాణను మోసం చేసిన గాంధీలు కనీసం స్వయంగా క్షమాపణ చెప్పలేరా అని కవిత నిలదీశారు.
11.దేశానికి తెలంగాణ రోల్ మోడల్

దేశానికి తెలంగాణ రోల్ మోడల్ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
12.అచ్చెన్న విమర్శలు
రాష్ట్రంలో ఓటర్ లిస్ట్ కన్నా వైసిపి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు ఎక్కువగా ఉన్నాయి అని ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు విమర్శించారు.
13.ధూళిపాళ్ల నరేంద్ర పై హత్యాయత్నం కేసు

పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పై హత్యాయత్నం కేసు నమోదు అయింది .ఏలూరు జిల్లా లింగంపాలెం మండలం రంగాపురం వాసు ముసునూరి రాము ఫిర్యాదు మేరకు పోలీసులు నరేంద్ర పై కేసు నమోదు చేశారు.
14.ప్రవీణ్ కుమార్ ను అరెస్టు చేయవద్దు
బీ ఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు , సిర్పూర్ నియోజకవర్గ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను అరెస్టు చేయడంతో సహా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు నేడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
15.కెసిఆర్ పై కిషన్ రెడ్డి విమర్శలు

తెలంగాణ ముఖ్యమంత్రి కాకముందు కేసీఆర్ కు ఆస్తులు లేవని , సీఎం అయ్యాక లక్షల కోట్ల ఆస్తులు కూడ బెట్టారు అని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు.
16.కేంద్రానికి నితీష్ కుమార్ హెచ్చరిక
కేంద్ర ప్రభుత్వంకి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ హెచ్చరిక చేశారు .బీహార్ కు అతి త్వరలోనే ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు .అలా జరగని నేపథ్యంలో కేంద్రానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడుతామని నితీష్ హెచ్చరించారు.
17.కెసిఆర్ ప్రసంగాలపై కాంగ్రెస్ ఫిర్యాదు

ఎన్నికల ప్రచార సభలో బీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.
18.పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి పై ఫిర్యాదు చేస్తా
పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి విజయ రమణారావు పై ఈడి, ఐటీ అధికారులకు ఫిర్యాదు చేస్తానని మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాష్ రావు అన్నారు .ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని , ఆయనపై ఫిర్యాదు చేస్తానని గోనె అన్నారు.
19.శబరిమలకు ప్రత్యేక రైళ్లు

శబరిమలై వెళ్లే అయ్యప్ప భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది .విజయవాడ మీదుగా ప్రత్యేక రైలు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.ఈనెల 19 న సికింద్రాబాద్ నుంచి కొల్లాం కు ప్రత్యేక రైలు సికింద్రాబాద్ లో మధ్యాహ్నం 2.40 కి బయలుదేరి 20న రాత్రి 11.57 గంటలకు కోల్లాం చేరుకుంటుంది.
20.అరుణాచలానికి సూపర్ లగ్జరీ బస్సు
కార్తీక పౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని అరుణాచలానికి ఆర్టిసి సూపర్ లగ్జరీ స్పెషల్ బస్సు నడుపుతున్నట్లు నర్సంపేట డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మి తెలిపారు.