పీరియడ్స్ కోసం మాత్రలు ఉపయోగిస్తున్నరా..? అయితే మరికొన్ని అనారోగ్య సమస్యలు రావడం ఖాయం..!

ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుత సమాజంలో ఎక్కువ మంది మహిళలు రుతుక్రమంలో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు.సక్రమంగా పీరియడ్స్( Periods ) రాకపోవడంతో కొంతమంది మందులు ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 Using Pills For Periods But Some More Health Problems Are Sure To Come , Period-TeluguStop.com

దీంతో లేనిపోని అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు.ఈ పరిస్థితికి గల కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి మహిళకు రుతుక్రమం తప్పనిసరి.ఒక వయసు వచ్చాక వారిలో నెల నెల పిరియడ్స్ రావడం అనేది సహజమే.

అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది మహిళలు పీరియడ్స్ సమస్యను ఎదుర్కొంటున్నారు.పీరియడ్స్ సకాలంలో రాకపోవడం, బ్లీడింగ్ సరిగ్గా కాకపోవడం వంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

Telugu Exercise, Problems, Pcod Problems, Period Problem, Periods, Sugar-Telugu

దీంతో కొందరు మహిళలు ఆ సమస్యలకు కారణం తెలియకుండానే వివిధ రకాల హార్మోన్లకు సంబంధించిన మందులను ఉపయోగిస్తూ ఉన్నారు.ఇలా ఉపయోగించడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.అసలు పీరియడ్ సమయానికి ఎందుకు రావు? దానికి గల కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.మహిళలలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కారణంగా శరీరంలో హార్మోన్ల సమతుల్యత ఏర్పడుతుంది.

దీని వల్ల పీసీఓడీ లాంటి ఆరోగ్య సమస్యలతో పాటు ఇంకా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి.వీటికోసం మందులు ఉపయోగించాల్సి ఉంటుంది.

ఫలితంగా చాలా మంది మహిళలు బరువు పెరుగుతారు.బరువు పెరగడం వల్ల పీరియడ్స్ సమస్యలు ( Period problem )మరింత తీవ్రమవుతాయి.

Telugu Exercise, Problems, Pcod Problems, Period Problem, Periods, Sugar-Telugu

ముఖ్యంగా చెప్పాలంటే మహిళలలో బరువు పెరగడం ఋతుక్రమాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇంకా చెప్పాలంటే సమయానికి తిండి తినకపోవడం, నిద్రలేమి, జీవనశైలిలో మార్పు కూడా పీరియడ్స్ సక్రమంగా రాకపోవడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు.ఇలాంటి సమస్యల నుంచి బయటపడడానికి మంచి ఆహారం తీసుకుని, రోజువారి వ్యాయామం చేస్తూ ఉండాలి.అంతేకాకుండా పచ్చళ్ళు,మిఠాయిలు లాంటి పదార్థాలకు దూరంగా ఉండాలి.అదే విధంగా ఉదయాన్నే ఒక 30 నిమిషాలు నడుస్తూ ఉండాలి.ఇవన్నీ చేయడం వల్ల మీరు బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయి.

లేకపోతే ప్రెగ్నెన్సీ సమయంలో బీపీ, షుగర్ లాంటివి వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అలాగే అబార్షన్లు ఎక్కువ జరిగే ప్రమాదము కూడా ఉంది.

కాబట్టి వైద్యులు ఇచ్చిన మందులు ఉపయోగిస్తూ బరువు తగ్గే ప్రయత్నం చేయాలి.వరుసగా మూడు నెలలపాటు నెలసరి రాకపోతే గర్భాశయంలో ఉండే పొర మందం అయిపోయి మరికొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube