కరోనా వైరస్ టీకాలు తొలి దశ ప్రారంభం కాగా పలుచోట్ల వ్యాక్సిన్ టీకాలు అందిస్తున్నారు.అంతేకాకుండా ఈ టీకాలను అందించే తరుణంలో వ్యక్తుల ఆరోగ్యాల విషయాలను దృష్టిలో పెట్టుకొని అందిస్తున్నారు.
వృద్ధులకు ఈ టీకాలను అందించిన వెంటనే సైడ్ ఎఫెక్ట్స్ వంటివి రావడం వల్ల అందించడం లేదు.ప్రస్తుతం టీకాలను అందిస్తున్న తరుణంలో వైద్య నిపుణులు కొన్ని జాగ్రత్తలు తెలిపారు.
కాగా రెండు టీకా లకు సంబంధించిన విషయాలలో కేంద్ర,రాష్ట్ర ప్రాంతాలకు లేఖ ద్వారా సమాచారాన్ని అందించారు.వాటికి ఎంత డోసు ఇవ్వాలి, ఏ వయసు వాళ్ళకు ఇవ్వాలి, ఎంత ఉష్ణోగ్రతల్లో వాటిని నిల్వ చేయాలి, వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్టులు గురించి కొన్ని విషయాలను ఫ్యాక్ షీట్ రూపంలో తెలిపారు.
వీటిని పలు వైద్య సంస్థలకు అందించేలా చేశారు.
ఈ టీకాను ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు ఇవ్వద్దని వైద్య నిపుణులు తెలిపారు.కారణం వీటి వల్ల సైడ్ ఎఫెక్టులు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు.అంతేకాకుండా వృద్ధులకు కూడా ఈ టీకాను వేయకూడదన్నారు.
అల్ ఆరోగ్య సమస్యలతో వచ్చిన వాళ్లకు ఈ టీకాలు వేస్తే సైడ్ ఎఫెక్టుల ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు.
కాగా ఈ టీకాను వేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఈ టీకాను తీసుకునే వారిలో ఎవరైనా అనారోగ్య సమస్య , తీవ్రమైన జ్వరంతో ఉంటే వాళ్లు కోలుకున్న ఎనిమిది వారాల తర్వాత టీకాను ఇవ్వాలని తెలిపారు.ఇదిలా ఉంటే ఇంతకుముందు కరోనా వైరస్ సోకి కోలుకున్న వాళ్లకు, మెదడు సంబంధిత వ్యాధులు, గుండె సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు, మూత్రపిండాల సమస్యలు ఉన్న వాళ్లకు ఇవ్వచ్చు అని వైద్య నిపుణులు తెలిపారు.
.