గ‌ర్భిణీల్లో మ‌ల‌బ‌ద్ధ‌కానికి కార‌ణాలేంటి.. ఎలా స‌మ‌స్య‌ను దూరం చేసుకోవాలి?

గ‌ర్భిణీ మ‌హిళ‌లు( Pregnant Woman ) ప్ర‌ధానంగా ఎదుర్కొనే స‌మ‌స్య‌ల్లో మ‌ల‌బ‌ద్ధ‌కం( Constipation ) ఒక‌టి.గర్భిణీల్లో మలబద్ధకానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి.

 What Are The Causes Of Constipation In Pregnant Women Details, Pregnant Women, P-TeluguStop.com

క‌డుపులో బిడ్డ పెరుగుతుండటంతో పేగులపై ఒత్తిడి పెరుగుతుంది.దీంతో పేగుల కదలికలు మందగించి మలబద్ధకం ఏర్ప‌డుతుంది.

అలాగే హార్మోన్ల మార్పులు, వైద్యులు సిఫార్సు చేసే ఐరన్, కాల్షియం సప్లిమెంట్లు, నీరు తక్కువగా తాగడం, తక్కువ ఫైబర్ ఆహారం తీసుకోవ‌డం, మానసిక ఒత్తిడి, ఎక్కువ సమయం కూర్చొని ఉండటం, రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం లేదా సరైన విశ్రాంతి లేకపోవడం వంటి కార‌ణాల వ‌ల్ల కూడా గ‌ర్భిణీల్లో మలబద్ధకానికి దారితీస్తుంది.

అయితే గ‌ర్భిణీల్లో మ‌ల‌బ‌ద్ధ‌కాన్ని నివారించే కొన్ని సూప‌ర్ ఫుడ్స్ ఉన్నాయి.

కూర‌గాయ‌ల్లో( Vegetables ) క్యారెట్‌, బీట్‌రూట్‌, పాల‌కూర‌, గుమ్మ‌డికాయ‌, క్యాబేజ్ పేగుల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.మలాన్ని సులభంగా బయటికి పంపి మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య‌కు చెక్ పెడ‌తాయి.

Telugu Apple, Banana, Foods, Tips, Latest, Pregnant, Probiotics, Vegetables-Telu

ప్రోబయాటిక్స్( Probiotics ) పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి మలబద్ధకం నివారిస్తాయి.అందువ‌ల్ల ప్రోబయాటిక్స్ మెండుగా ఉండే పెరుగు, మ‌జ్జిగను గ‌ర్భిణీ మ‌హిళ‌లు రెగ్యుల‌ర్ గా తీసుకోవాలి.

గ‌ర్భిణీ స్త్రీల‌కు అరటిపండు, యాపిల్ ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటాయి.అర‌టిపండులో సహజమైన లాక్సేటివ్, ఫైబర్ అధికంగా ఉంటాయి.యాపిల్ లో పెక్టిన్ అనే ఫైబర్ ఉంటుంది.అందువ‌ల్ల ఈ పండ్లు పేగులకు మృదువైనదిగా పని చేస్తాయి.

మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య‌కు చెక్ పెడ‌తాయి.

Telugu Apple, Banana, Foods, Tips, Latest, Pregnant, Probiotics, Vegetables-Telu

బ్రౌన్ రైస్, ఓట్స్, గోధుమ రొట్టె, క్వినోవా, జొన్నలు, శనగలు, మినుములు, రాజ్మా ఫైబర్ కు మంచి మూలం.గ‌ర్భిణీలు వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే జీర్ణక్రియ ప‌నితీరు మెరుగుప‌డుతుంది.మ‌ల‌బ‌ద్ధ‌కం నుంచి సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌తారు.

ఇక ఈ సూప‌ర్ ఫ్రూట్ ను తీసుకోవ‌డంతో పాటు రోజూ ఎనిమిది నుంచి ప‌ది గ్లాసుల నీరు త్రాగాలి.డాక్టర్ సలహా తీసుకుని రోజుకు కనీసం 30 నిమిషాల నడక లేదా వ్యాయామం చేయాలి.

ఒత్తిడి తగ్గించుకునేందుకు మెడిటేషన్ ను ఎంపిక చేసుకోవాలి.ఆహారాన్ని ఒకేసారి కాకుండా త‌క్కువ మొత్తంలో ఎక్కువ‌సార్లు తీసుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube