ఈ మధ్యకాలంలో కంప్యూటర్, ఫోన్, టీవీ స్క్రీన్ చూడటం చాలా ఎక్కువగా అయిపోయింది.చిన్న దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్లకు, కంప్యూటర్లకు, అలవాటు పడిపోయారు.
దీనివలన కంటి సంబంధిత సమస్యలు వచ్చి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అయితే వీటి నుంచి బయటపడేందుకు రోజు ఈ పండును తినడం వలన చూపుకు చాలా మంచిదని తాజాగా ఓ అధ్యయనం చెబుతోంది.
అయితే ఆ పండు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ కి చెందిన ఒక బృందం దీనికి సంబంధించిన అధ్యయనం నిర్వహించడం జరిగింది.

అయితే ఈ అధ్యయనంలో 16 వారాలపాటు 34 మంది పాల్గొన్నారు.అయితే వాళ్లను ప్రతిరోజు ఒకటిన్నర కప్పుల ద్రాక్ష లేదా ప్లేసైబో( Grapes or placebo ) ఇచ్చారు.ప్లేసిబో తో పోలిస్తే ద్రాక్ష తినే వారిలో మాక్యులర్ పిగ్మెంట్ ఆప్టికల్ డెన్సిటీ, ప్లాస్మా యాంటీ ఆక్సిడెంట్లు, ఫినోలిక్ కంటెంట్ లో గణనీయమైన పెరుగుదల కనిపించింది.అయితే ద్రాక్ష తినని వారిలో గ్లైకేషన్ లో గణనీయమైన పెరుగుదల నమోదయింది.
అయితే ఏజింగ్ ప్రాసెస్ లో ఇది చాలా హానికరాగమైనది.ద్రాక్ష వినియోగం మానవులలో కంటి ఆరోగ్యాన్ని( Eye health ) ప్రభావితం చేస్తుంది.
కంటి చూపుకి ద్రాక్ష వినియోగం చాలా ఉపయోగకరమైనది.ముఖ్యంగా వృద్యాప వయసులో కూడా కంటి సమస్యలు( Eye problems ) ఎదుర్కొంటున్న వాళ్లు ద్రాక్ష పండును తినడం వలన చాలా ప్రయోజనకరంగా ఉంటుందని పరిశోధకులు కూడా తెలిపారు.

అయితే ద్రాక్ష అందరికీ అందుబాటులో దొరికే అద్భుతమైన పండు కావడం వలన ప్రతి ఒక్కరు కూడా ద్రాక్షను తినడం వలన మంచి జరుగుతుంది.ఇక రోజుకి కేవలం ఒకటిన్నర కప్పు సాధారణ పరిమాణంలో తీసుకుంటే మంచి ప్రయోజనాలు పొందవచ్చు.అలాగే క్రమం తప్పకుండా తీసుకోవడం వలన పెద్దవారిలో కూడా కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.ఆక్సిడేటివ్ స్ట్రెస్ కారణంగా కంటిచూపు ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది.అయితే శరీరంలో తగినంత ఆంటీ ఆక్సిడెంట్లు ( Antioxidants )లేనందువలన ఈ కణాలు దెబ్బతింటాయి.అందుకే నాలుగు నెలల పాటు రోజుకు రెండు పూటలా ద్రాక్ష పండు( Grape fruit )ను తీసుకోవడం వలన కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.







