ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 5.45
సూర్యాస్తమయం: సాయంత్రం 06.41
రాహుకాలం:ఉ.9.00 ల10.30
అమృత ఘడియలు:అష్టమి మంచిది కాదు.
దుర్ముహూర్తం: ఉ.7.41 ల8.32
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
<img src="https://telugustop.com/wp-content/uploads/2023/05/meesha-rashi-phalalu-MAY-2023.jpeg” />ఈరోజు మీకు మిత్రుల ఆహ్వానం ఆనందం కలిగిస్తుంది.ఇంట బయట వ్యవహారాలు కలిసి వస్తాయి.గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.
వృత్తి ఉద్యోగాల్లో అధికారులు ఆదరణ పెరుగుతుంది.కొన్ని విషయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది.వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి.
వృషభం:
ఈరోజు మీరు భూ సంబంధిత క్రమ విక్రమాల్లో లాభాలు అందుకుంటారు.ఆర్థికంగా పురోగతి కలిగి అవసరానికి ధన సహాయం అందుతుంది.సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగిన ఫలితం పొందుతారు.నిరుద్యోగ ప్రయత్నాలు పలుస్తాయి.
మిథునం:
ఈరోజు మీకు సన్నిహితుల నుండి వాదనలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది.చేపట్టిన వ్యవహారాలు సకలంలో పూర్తవుతాయి.ఆదాయం పెరుగుతుంది.ప్రతి వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు పలుస్తాయి.విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.
కర్కాటకం:
ఈరోజు ఆర్థిక లావాదేవులు ఆశాజనకంగా ఉంటాయి.నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు.చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి.
సింహం:
ఈరోజు మీరు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తవుతాయి.కొన్ని వ్యవహారాలు మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది.ప్రతి ఉద్యోగాల్లో పని ఒత్తిడి వలన మానసిక ప్రశాంతత ఉండదు.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.
కన్య:
ఈరోజు మీరు ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు.చుట్టుపక్కల వారితో అప్రమత్తంగా వ్యవహరించాలి.కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు.
సన్నిహితులతో విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆర్థికంగా కొంత పురోగతి సాధిస్తారు.ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది.
తులా:
ఈరోజు ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి.దూర ప్రాంతాలను నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.చిన్ననాటి మిత్రులు కలిసి కొన్ని విషయాలు చర్చిస్తారు.
నూతన కార్యక్రమాలను ప్రారంభించడానికి శ్రీకారం చుడతారు.కీలక వ్యవహారాల్లో సొంత ఆలోచనలు చేయడం మంచిది.
వృశ్చికం:
ఈరోజు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్న అవసరానికి ధన సహాయం అందుతుంది.దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి.వృత్తి వ్యాపారాల్లో సమస్యలను అధిగమించి లాభాలను అందుకుంటారు.
ధనస్సు:
ఈరోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.వృత్తి వ్యాపారాలు ఆశించిన లాభాలు అందుకుంటారు.చేపట్టిన పనుల్లో జాప్యం కలిగిన విధంగా పూర్తి చేస్తారు.సోదరుల సహాయంతో కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు.ఆకస్మిక ధన లాభం పొందుతారు.వృత్తి ఉద్యోగాల్లో అనుకూలత వాతావరణం పెరుగుతుంది
మకరం:
ఈరోజు బంధుమిత్రుల నుండి ఆశించిన సహాయం అందుతుంది.వాహన కొనుగోలు ప్రయత్నాలు పలుస్తాయి.దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి కొంతవరకు తొలగుతుంది.
విలువైన వస్తువుల విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి.వ్యాపార వ్యవహారాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు.
కుంభం:
ఈరోజు అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు.నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.వృత్తి ఉద్యోగాలు పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు.
మీనం:
ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణాలు తీర్చుకోగలుగుతారు.ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.వృత్తి ఉద్యోగాల్లో ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది.
వ్యాపారాలు స్వల్పంగా లభిస్తాయి.
LATEST NEWS - TELUGU