విజయ్ పరువు తీసిన క్రిటిక్.. కరెంట్ ఖర్చులు కూడా రాలేదట..!

కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన మాస్టర్ సినిమా ఈ నెల 13వ తేదీన తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదలైంది.లోకేష్ కనగరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ఈ సినిమా విజయ్ ఫ్యాన్స్ ను మెప్పించినా సాధారణ ఫ్యాన్స్ ను మాత్రం మెప్పించలేదు.

 Vijay Master Movie Collections In  Bollywood Industry, Bollywood Industry, Colle-TeluguStop.com

తమిళంలో ఈ సినిమాకు భారీగా కలెక్షన్లు వస్తుండగా తెలుగులో ఈ సినిమా హక్కులు తక్కువ మొత్తానికే అమ్ముడవడంతో బ్రేక్ ఈవెన్ అయింది.

ఈ సినిమా హిందీలో కూడా విడుదల కాగా అక్కడ ఈ సినిమా నామమాత్రపు కలెక్షన్లను కూడా రాబట్టలేదని సమాచారం.

బాలీవుడ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ ట్విట్టర్ వేదికగా మాస్టర్ సినిమా కలెక్షన్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మాస్టర్ సినిమా హిందీలో డిజాస్టర్ గా నిలిచిందని.

తొలిరోజు ఈ సినిమాకు 4 లక్షల రూపాయలు కలెక్షన్ల రూపంలో వచ్చాయని పేర్కొన్నారు.మాస్టర్ సినిమాకు వచ్చిన కలెక్షన్లు థియేటర్ల ఖర్చులకు కూడా సరిపోవని అన్నారు.

మాస్టర్ సినిమా కలెక్షన్లతో థియేటర్ల సిబ్బంది, ఇతర ఖర్చులను కూడా చెల్లించలేమని అన్నారు. మాస్టర్ సినిమా సౌత్ ఇండియాలో బ్లాక్ బస్టర్ హిట్ అని అందరూ అంటున్నారని మరి హిందీ నిర్మాతలు 83, సూర్యవంశీ లాంటి పెద్ద సినిమాల రిలీజ్ డేట్ లను ఎందుకు ప్రకటించడం లేదో తనకు అర్థం కావడం లేదని కమల్ ఆర్ ఖాన్ అన్నారు.బాలీవుడ్ క్రిటిక్ చేసిన ఈ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మాస్టర్ సినిమా నార్త్ ఇండియా హక్కులు 12 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారని సమాచారం.

ఈ సినిమా నామమాత్రపు వసూళ్లను రాబట్టలేకపోవడంతో చాలా థియేటర్ల నుంచి ఇప్పటికే ఈ సినిమాను తొలగించారని సమాచారం.మాస్టర్ కలెక్షన్లు బాలీవుడ్ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube