కిడ్నీలకు అండగా కొత్తిమీర.. ఇలా తీసుకుంటే ఊహించని ఆరోగ్య లాభాలు మీ సొంతం!

కొత్తిమీర( Coriander ).వంటలకు చక్కని రుచి, ఫ్లేవర్ ను అందించడంలో దీనికి సాటి మరొకటి లేదు.

 Amazing Benefits Of Coriander Leaves For Kidneys!, Coriander Leaves, Coriander L-TeluguStop.com

ఎక్కువ శాతం మంది కొత్తిమీరను కేవలం నాన్ వెజ్ వంటలకు, బిర్యానీ తయారీలో మాత్రమే ఉపయోగిస్తుంటారు.కానీ కొత్తిమీరలో మన ఆరోగ్యానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.

అనేక జబ్బులకు చెక్ పెట్టే సామర్థ్యం కొత్తిమీరకు ఉంది.ముఖ్యంగా కొత్తిమీరను ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే ఊహించని ఆరోగ్య లాభాలు( Health Benefits ) మీ సొంతం అవుతాయి.

Telugu Coriander, Tips, Kidney, Kidneys, Latest-Telugu Health

ముందుగా అర కప్పు తరిగిన కొత్తిమీర ని తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాసు వాటర్ తో పాటు క‌డిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి.అలాగే చిన్న అల్లం ముక్క( Ginger ) కూడా వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత ఆ వాటర్ ను ఫిల్టర్ చేసుకుని కొంచెం తేనె కలిపి సేవించాలి.

ఈ విధంగా కొత్తిమీరను నిత్యం తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి.కిడ్నీలకు కొత్తిమీర అండగా ఉంటుంది.

పైన చెప్పిన విధంగా కొత్తిమీర వాటర్ ను తయారు చేసుకుని రోజూ తీసుకుంటే మూత్రపిండాల్లో పేరుపోయిన మ‌లినాలు తొలగిపోయి.శుభ్రంగా ఆరోగ్యంగా మారుతాయి.

కిడ్నీ సంబంధిత వ్యాధులు( Kidney Problems ) దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

Telugu Coriander, Tips, Kidney, Kidneys, Latest-Telugu Health

నెలసరి సమయంలో చాలామంది మ‌హిళలు కడుపునొప్పి, నడుము నొప్పి, తలనొప్పి, కాళ్లు లాగడం వంటి వాటితో సతమతం అయిపోతుంటారు.అయితే ఈ కొత్తిమీర వాటర్( Coriander Water ) ను తీసుకుంటే ఆయా సమస్యలన్నీ పరార్ అవుతాయి.నెలసరి తేలికగా అయిపోతుంది.

కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.అందువల్ల కొత్తిమీర మరిగించిన వాటర్ ను తీసుకుంటే ఇమ్యూనిటీ సిస్ట‌మ్‌ బూస్ట్ అవుతుంది.

జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు ఉంటే దూరం అవుతాయి.
కొంతమంది కడుపులో మంట అంటూ తరచూ ఇబ్బంది పెడుతుంటారు.

అయితే అలాంటి సమయంలో ఒక గ్లాసు మజ్జిగ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు కొత్తిమీర రసంతో పాటు వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్( Lemon Juice ) ను మిక్స్ చేసి తాగాలి.ఇలా తీసుకుంటే కడుపులో మంట చిటికెలో మాయమవుతుంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube