చాలా తక్కువ కాలంలో, తక్కువ సినిమాలతో సంచలనంగా మారిన దర్శకులు వీరే !

ఈ మధ్యకాలంలో ఒక నార్మల్ దర్శకుడు స్టార్ డైరెక్టర్ అయిపోవాలంటే ఎక్కువ సమయం తీసుకోవడం లేదు.అందుబాటులో ఉన్న టెక్నాలజీ వాడుకుంటూ సినిమాని విపరీతమైన హైప్ క్రియేట్ చేసేలా ప్లాన్ చేసుకొని దానిని విజయవంతం చేసుకోవడానికి ఈ శాయ శక్తుల ప్రయత్నిస్తున్నారు ఇప్పటి తరం దర్శకులు.

 Tollywood Directors Who Became Sensational Movies In Short Time Sandeep Reddy Va-TeluguStop.com

అందుకే చాలా తక్కువ సమయంలో కొంత మంది దర్శకులు సెన్సేషనల్ డైరెక్టర్స్ అయిపోతున్నారు.స్టార్ హీరోలు అంతా కూడా వారి వెనకే పడుతూ వారితోనే సినిమాలు చేయాలని అనుకుంటున్నారు.

మరి ఇంత సంచలనం సృష్టించడానికి గల కారణం ఏంటి అంటే వారు తీసుకుంటున్న కథ అలాగే దానిపై పెడుతున్న శ్రద్ధ, ప్రతి క్యారెక్టర్ పై పెట్టే ఫోకస్, స్క్రీన్ ప్లే వాడుకుంటున్న విధానం ఇలా అన్నీ కూడా వారికి కలిసి వస్తున్నాయి.మరి అంత సంచలనం సృష్టిస్తున్న ఆ దర్శకులు ఎవరు ? ప్రస్తుతం వారు ఏ సినిమాలు తీస్తున్నారు అనే విషయాన్ని ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

సందీప్ రెడ్డి వంగ

Telugu Animal, Arjun Reddy, Bimbisara, Vasishta, Kalki, Nag Ashwin, Sandeepreddy

సంచలనానికి ఈ దర్శకుడు మారుపేరు.ఈయన తీసిన మొదటి సినిమా అర్జున్ రెడ్డి( Arjun Reddy ) తోనే విషయం ఉన్నోడు అని అందరూ అనుకున్నారు.పైగా అర్జున్ రెడ్డి సినిమాకి ముందు ఆ తర్వాత అనే విధంగా ఇండస్ట్రీ డివైడ్ అయిపోయింది.అంతలా సినిమా పోకడను మార్చిన దర్శకుడిగా సందీప్ కి( Sandeep Reddy Vanga ) పేరు వచ్చింది.

ప్రస్తుతం బాలీవుడ్ ని కూడా ఢీకొట్టే విధంగా ఈయన సినిమాలు తీస్తున్నాడు.కానీ తీసినవి మాత్రం మూడు సినిమాలు మాత్రమే.మొదటి సినిమా తోనే ఫేమస్ అయిపోయిన సందీప్ ఆ తర్వాత అదే సినిమాను కబీర్ సింగ్ పేరుతో హిందీలో చేయగా మూడో సినిమా ఆనిమల్( Animal ) మాత్రమే.

నాగ్ అశ్విన్

Telugu Animal, Arjun Reddy, Bimbisara, Vasishta, Kalki, Nag Ashwin, Sandeepreddy

సినిమా ఇండస్ట్రీలో ఉండే అన్ని విభాగాలపై మంచి పట్టు కోసం పెద్ద దర్శకుల దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన నాగ్ అశ్విన్( Nag Ashwin ) తానే సొంతంగా కథ రాసుకొని ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాను తీసి తన భార్య ను నిర్మాతగా పెట్టి చాలా రిస్క్ చేసి హిట్టు కొట్టాడు.ఆ తర్వాత ఆయన తీసిన ప్రభంజనం లాంటి సినిమా మహానటి.ఇక ఇప్పుడు ప్రభాస్ తో కలిసి కల్కి సినిమా( Kalki Movie ) తీస్తున్నాడు.

దీనిపై ప్రపంచ వ్యాప్తంగా మంచి హైప్ ఉంది.మరి ఈ దర్శకుడు కూడా చాలా షార్ట్ టైంలో సెన్సేషనల్ డైరెక్టర్ గా మారిపోయాడు.

వశిష్ట

Telugu Animal, Arjun Reddy, Bimbisara, Vasishta, Kalki, Nag Ashwin, Sandeepreddy

ఇప్పటివరకు తీసింది కేవలం ఒక్క సినిమా మాత్రమే కళ్యాణ్ రామ్ చాలా ఏళ్ల నుంచి ఒక విషయం లేక పరితపిస్తుంటే బింబిసారా సినిమాతో( Bimbisara ) ఆయనకు విజయాన్ని అందించాడు.దాంతో మెగా కాంపౌండ్ నుంచి పిలుపు వచ్చి ప్రస్తుతం చిరంజీవితో విశ్వంభర సినిమా( Vishwambhara ) తీస్తున్నాడు.చాలా రోజులుగా చిరంజీవి కూడా పరాజయాలనే ఎదుర్కొంటున్నాడు.మరి ఈ విశ్వంభర సినిమా అటు చిరంజీవికి సవాల్ లాంటిది.అలాగే ఈ సినిమా విజయవంతం అయితే వశిష్ట( Vasishta ) కూడా ఓవర్ నైట్ స్టార్ట్ డైరెక్టర్ అయిపోతాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube