బాలీవుడ్ లో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సౌత్ సినిమాలు.. రాధేశ్యామ్ ఏ ప్లేస్లో ఉందంటే?

ఒకప్పుడు సౌత్ హీరోలకు నార్త్ లో పెద్దగా క్రేజ్ ఉండేది కాదు.ఒకవేళ కాస్త ధైర్యం చేసి సౌత్ హీరోలు తమ సినిమాలను నార్త్ లో విడుదల చేసినా అవి ఫ్లాప్ గానే మిగిలిపోతూ  ఉండేవి.

 Bollywood Highest Collections From Telugu , Highest Collections , Bollywood ,-TeluguStop.com

కానీ.ఇప్పుడు మాత్రం పూర్తిగా పరిస్థితుల్లో మార్పు వచ్చింది.

ఇటీవల కాలంలో సౌత్ హీరోల సినిమాలకు నార్త్ అభిమానులు అందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు అని చెప్పాలి.ఈ క్రమంలోనే ఇటు సౌత్ లోనే కాదు అటు నార్త్ లో కూడా ఇక సౌత్ సినిమాలు వంద కోట్ల వసూళ్లు సాధించే స్థాయికి చేరు కున్నాయి.

మరి ఇప్పటి వరకు ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు లిస్టు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బాహుబలి 2 : ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన రాజమౌళి 2 సినిమా ఊహించని రేంజ్ లో అంచనాలతో విడుదలైంది.ఈ సినిమా మొదటి వారం ఏకంగా 247 కోట్ల రూపాయలు వసూలు చేసింది.ఇక బాలీవుడ్ లో హైయెస్ట్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఇప్పటికీ ఇవే కావడం గమనార్హం.

Telugu Allu Arjun, Bahubali, Bollywood, Yash, Kabaali, Pooja Hegde, Prabhas, Pus

రోబో 2.0 : రజనీ కాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన రోబో 2.0 సినిమా బాలీవుడ్ లో కూడా బాగా హిట్ అయింది.కారణం ఇక బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ విలన్ పాత్రలో నటించటమే.

ఈ సినిమా మొదటి వారం 133 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.

సాహో : బాహుబలి సినిమా తర్వాత భారీ అంచనాల మధ్య ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమా సాహో.తెలుగులో ఆవరేజ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ హిందీలో మాత్రం మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.కానీ సినిమాకు మొదటి 116 కోట్లు వసూలు కావడం గమనార్హం.

బాహుబలి : దర్శకధీరుడు రాజమౌళి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన బాహుబలి సినిమా వరల్డ్ వైడ్ సూపర్ హిట్ అయింది.2015లో విడుదలైన బాహుబలి సినిమా బాలీవుడ్ లో మొదటి వారం 46.47 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.

Telugu Allu Arjun, Bahubali, Bollywood, Yash, Kabaali, Pooja Hegde, Prabhas, Pus

పుష్ప : ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా టాలీవుడ్ లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా మొదటి రోజు కాస్త నెగిటివ్ టాక్ సొంతం చేసుకొని  తక్కువగా వసూలు చేసినప్పటికీ ఆ తర్వాత పుంజుకుని ఏకంగా మొదటి వారం 27 కోట్లు వసూళ్లు రాబట్టింది.

కే జి ఎఫ్ : తమిళ హీరో యష్ నటించిన కేజిఎఫ్ సినిమా మొదట్లో ఆవరేజ్ టాక్ సొంతం చేసుకున్న.ఆ తర్వాత మాత్రం వసూళ్లలో మెల్లిగా పుంజు కుంది.

ఇక ఫస్ట్ వీక్ వేసవి 22 కోట్ల వసూలు సాధించింది ఈ సినిమా.

Telugu Allu Arjun, Bahubali, Bollywood, Yash, Kabaali, Pooja Hegde, Prabhas, Pus

కబాలి: ఆలిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కబాలి.అప్పట్లో ఊహించని రేంజ్ లో అంచనాలతో సినిమా విడుదలైంది.సినిమా బాలీవుడ్ లో తొలివారం పూర్తయ్యే సరికి 20 కోట్లు ఓపెనింగ్స్ రాబట్టిన కలిగింది.

రాధేశ్యామ్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ రాధా కృష్ణ కుమార్ కాంబినేషన్లో వచ్చిన రాధేశ్యామ్ సినిమా అనుకున్నంత స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేక పోయింది.మొదటి వారం ముగిసే సరికి 18.8 కోట్లు మాత్రమే వసూలు సాధించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube