నిత్యం ఈ హెర్బల్ టీను తీసుకుంటే నెల రోజుల్లో బెల్లీ ఫ్యాట్ కు బై బై చెప్పవచ్చు!

బెల్లీ ఫ్యాట్ ( Belly fat )అనేది ఆడ మగ అనే తేడా లేకుండా ఎంతో మందిని కలవర పెడుతున్న సమస్య.శరీరానికి శ్ర‌మ లేకపోవడం, గంటలు తరబడి కూర్చొని ఉండడం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, కంటి నిండా నిద్ర లేకపోవడం, పలు రకాల మందుల వాడకం తదితర కారణాల వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది.

 Say Goodbye To Belly Fat By Consuming This Herbal Tea! Herbal Tea, Hibiscus Tea,-TeluguStop.com

అయితే ఈ కొవ్వును కరిగించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే హెర్బల్ టీను నిత్యం తీసుకుంటే నెల రోజుల్లో బెల్లీ ఫ్యాట్ కు బై బై చెప్పవచ్చు.

మరి ఇంకేంటి ఆలస్యం ఆ హెర్బల్ టీ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Telugu Belly Fat, Fat Cutter, Tips, Hibiscus Tea, Latest, Goodbyebelly-Telugu He

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక మూడు ఎండిన మందారం పువ్వులు ( Dried hibiscus flowers )వేసుకోవాలి.అలాగే పావు టీ స్పూన్ పసుపు( Turmaric ) మరియు అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి ( Cinnamon powder )వేసి దాదాపు ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మరిగించిన టీ ను ఫిల్టర్ చేసుకోవాలి.గోరువెచ్చగా అయిన తరువాత వన్ టీ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ ( Apple Cider Vinegar )ను కలిపి సేవించాలి.

Telugu Belly Fat, Fat Cutter, Tips, Hibiscus Tea, Latest, Goodbyebelly-Telugu He

ఈ హెర్బల్ టీ ను మీ మార్నింగ్ రొటీన్ లో భాగం చేసుకుంటే చాలా ఆరోగ్య లాభాలు పొందుతారు.ముఖ్యంగా ఈ మందారం టీ పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కాల్చేస్తుంది.బాన పొట్టను ఫ్లాట్ గా మారుస్తుంది.వెయిట్ లాస్ ను ప్రమోట్ చేస్తుంది.బెల్లీ ఫ్యాట్ తో బాధపడుతున్న వారికి ఈ హెర్బల్ టీ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.అలాగే ఈ హెర్బ‌ల్ టీ హార్మోన్ల సమతుల్యతను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది, ఇది మూడ్ స్వింగ్స్, డిప్రెషన్ మరియు అతిగా తినడం వంటి రుతుక్రమం యొక్క లక్షణాలను తగ్గిస్తుంది.

అంతేకాకుండా ఈ హెర్బల్ టీ కాలేయ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో మరియు సమర్థవంతంగా పని చేయడంలో కూడా తోడ్ప‌డుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube