మనలో చాలా మంది తమ ముఖ చర్మాన్ని తెల్లగా మెరిపించుకోవడం కోసం తెగ ప్రయత్నిస్తూ ఉంటారు.రకరకాల స్కిన్ వైట్నింగ్ క్రీములను వాడుతుంటారు.
వాటికోసం వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.కానీ పైసా ఖర్చు లేకుండా అరటి తొక్కలతో స్కిన్ ను సూపర్ వైట్ గా మార్చుకోవచ్చు.
అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక అరటిపండు పీల్ ను( Peel the banana ) తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో కట్ చేసుకున్న అరటిపండు తొక్కలు, రెండు టేబుల్ స్పూన్లు కడిగిన బియ్యం( rice ) మరియు ఒక కప్పు వాటర్ వేసి పది నుంచి పన్నెండు నిమిషాల పాటు ఉడికించాలి.ఇలా ఉడికించిన పదార్థాలను చల్లారబెట్టి మిక్సీ జార్ లో స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి( Multani soil ), వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్( Lemon juice ) వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని ఆరబెట్టుకోవాలి.

పూర్తిగా డ్రై అయ్యాక వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.వారానికి రెండుసార్లు ఈ రెమెడీని కనుక పాటిస్తే చర్మం పై పేరుకుపోయిన మురికి, మృతకణాలు తొలగిపోతాయి.స్కిన్ డీప్ గా క్లెన్సింగ్ అవుతుంది.అలాగే స్కిన్ కలర్ క్రమంగా ఇంప్రూవ్ అవుతుంది.చర్మం తెల్లగా కాంతివంతంగా మారుతుంది.ఫేషియల్ హెయిర్ గ్రోత్ తగ్గుతుంది.
అరటి తొక్కలో విటమిన్ సి మరియు ఎంజైమ్‌లు ఉంటాయి, ఇవి చర్మపు రంగును ప్రకాశవంతం చేస్తాయి మరియు నల్ల మచ్చలను తగ్గిస్తాయి.అరటిపండు తొక్కలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి ముడతలు మరియు ఫైన్ లైన్ల రూపాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.