టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఏ స్థాయిలో పేరు, గుర్తింపు ఉందో నందమూరి ఫ్యామిలీకి ( Nandamuri family )సైతం అదే స్థాయిలో పేరు, గుర్తింపు ఉంది.నందమూరి ఫ్యామిలీ నుంచి తక్కువమంది హీరోలే సినిమాల్లోకి వచ్చినా ఆ హీరోలలో మెజారిటీ హీరోలు సక్సెస్ సాధించారు.
అయితే అన్ స్టాపబుల్ షోకు( unstoppable show ) ఎంతోమంది హీరోలు హాజరైనా జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేదు.భవిష్యత్తులో సైతం తారక్ ఈ షోకు హాజరయ్యే పరిస్థితులు అయితే కనిపించడం లేదని చెప్పవచ్చు.
మరోవైపు అన్ స్టాపబుల్ షోలో బాబీ( Bobby ) గురించి చెబుతూ బాబీ డైరెక్ట్ చేసిన అన్ని సినిమాల ఫోటోలను చూపిస్తూ ప్రస్తావించిన బాలయ్య జై లవకుశ సినిమా( Jai Lavakusa movie ) గురించి మాత్రం ప్రస్తావించకపోవడం, ఆ సినిమా పోస్టర్లను షోలో చూపించకపోవడం గమనార్హం.తారక్ పేరెత్తడానికి కూడా బాలయ్య ఇష్టపడకపోవడంతో తారక్ ఏం తప్పు చేశాడని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాలయ్య గురించి ఏ ఇంటర్వ్యూలో కూడా నెగిటివ్ గా కామెంట్లు చేయలేదు.బాలయ్యతో తనకు ఎలాంటి మనస్పర్ధలు లేవని జూనియర్ ఎన్టీఆర్ పలు సందర్భాల్లో పరోక్షంగా చెప్పుకొచ్చారు.జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యేలా బాలయ్య బిహేవ్ చేయడం విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
అరవింద సమేత రిలీజ్ సమయంలో కూడా బాలయ్య, తారక్ మధ్య గ్యాప్ లేదని తర్వాత రోజుల్లో ఈ గ్యాప్ పెరిగిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండటం గమనార్హం.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ త్వరలో కొత్త ప్రాజెక్ట్స్ ను ప్రకటించనున్నారు.
తారక్ సినిమాలన్నీ 300, 400 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం.ఇతర భాషలపై కూడా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దృష్టి పెడుతుండటం గమనార్హం.