యాదాద్రి భువనగిరి జిల్లా:చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా వచ్చే సర్వీస్ రోడ్డులో డ్రైనేజీ నిర్మాణాలు చేపడుతున్న ప్రాంతాన్ని శనివారం సిపిఎం నాయకులు సందర్శించారు.డ్రైనేజీ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను పాటించకుండా నాసిరక పనులు చేస్తున్నారని ఆరోపిస్తూ ధర్నా చేశారు.
ఈ సందర్భంగా సిపిఎం నాయకులు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బూర్గు కృష్ణారెడ్డి,రాగిరి కృష్ణయ్య ఎండి పాషా,గోశిక కరుణాకర్ మాట్లాడుతూ చౌటుప్పల్ చెరువు నుండి అలుగు నీరు వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందని,ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో నిర్మిస్తున్న డ్రైనేజీ వర్షాలు కురిసినప్పుడు వచ్చే వరదలకు సరిపోవని,ఈ డ్రైనేజీ వాటి విస్తరణ పెంచాల్సిన అవసరం ఉందన్నారు.భవిష్యత్తు చౌటుప్పల్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని డ్రైనేజీ నాణ్యతా ప్రమాణాలతో కూడిన నిర్మాణాలు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
డ్రైనేజీ మీద వేసే స్లాబు చిన్న ఆటో వెళ్లిన బైక్లు వెళ్లిన కూలిపోయే పరిస్థితి ఉందన్నారు.డ్రైనేజీ మీద స్లాబ్ వేసి పది రోజులు కూడా కాకుండానే డ్రైనేజీల స్లాబ్ మూతలు పగిలిపోవడం,ప్రాణ,ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో బత్తుల దాసు,శ్రీనివాస్ రెడ్డి, బత్తుల లక్ష్మయ్య,గంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,జటంగి కృష్ణ,భావనలపల్లి స్వామి,సోమరాజు, బత్తుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.