నిర్లక్ష్యంగా వ్యహరించి ఒక మృతికి కారణమైన స్విమ్మింగ్ పూల్ నిర్వాహకుడికి జైలు శిక్ష..

రాజన్న సిరిసిల్ల జిల్లా:పర్యవేక్షణ లోపంతో నిర్లక్ష్యంగా వ్యహరించి ఒక మృతి కారణమైన స్విమ్మింగ్ పూల్ నిర్వాహకుడికి ఒక సంవత్సరము జైలు శిక్షతో పాటు 2000/-రూపాయల జరిమానా.నిర్లక్ష్యంగా వ్యహరించి ఒక మృతి కారణం అయిన స్విమ్మింగ్ పూల్ నిర్వాహకుడికి ఒక సంవత్సరము కఠిన కారాగార జైలు శిక్షతో పాటు 2000/- వేయిల రూపాయల జరిమానా సిరిసిల్ల ప్రథమశ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ సోమవారం తీర్పు వెల్లడించినట్లు పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ తెలిపారు.

 Jail Sentence For Swimming Pool Manager Who Caused One Death Due To Negligence,-TeluguStop.com

ఈ మేరకు సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతు….విద్యానగర్ లో గల స్విమ్మింగ్ పూల్ లో తేది:- 21.03.2015 రోజున సాయంత్రం 06:00 గంట సమయంలో మెరుగు మురళీధర్ విద్యానగర్, సిరిసిల్ల అనే వ్యక్తి కొడుకు మెరుగు శివ, విద్యానగర్ సిరిసిల్ల అనునతడు విద్యానగర్ లో గల స్విమ్మింగ్ పూల్ లో ఈత నేర్చుకోవడానికి వెళ్లి స్విమ్మింగ్ పూల్ లో దిగి లోతులోకి వెళ్లి ఈత రాక నీటిలో మునిగి చనిపోయినడని స్విమ్మింగ్ పూల్ నిర్వాహకుడైన చల్ల రవి చిన్నబోనల,

సిరిసిల్ల అనునతని నిర్లక్ష్యంగా వ్యవహరించి సరియైన పర్యవేక్షణ లేనందున నీటిలో మునిగి చనిపోయినడని పిర్యాదు చేయగా కేసు నమోదు చేసి నిర్వాహకుడైన చల్ల రవి, చిన్నబోనల, సిరిసిల్ల అనునతడిని బాలకిషన్ ఎస్ ఐ అరెస్టు చేసి రిమాండ్ కి తరలించడం జరిగిందన్నారు .విచారణ అనంతరం విచారణ అధికారి బాలకిషన్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా సి ఎం ఎస్ ఎస్.ఐ.రవీందర్ నాయుడు ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ వేముల నరేష్ పదమూడు (13) మంది సాక్షులను ప్రవేశపెట్టినారు.ప్రాసిక్యుశన్ తరుపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెలుముల సందీప్ వాదించగా కేసు పూర్వపరాలు పరిశీలించిన న్యాయమూర్తి ఏ.ప్రవీణ్ నేరస్తుడు అయిన చల్ల రవి కు ఒక సంవత్సరం జైలు శిక్ష తో పాటు రెండు వేయిల రూపాయల జరిగిన,మురళిధర్ కు నష్టపరిహారంగ యాబై వేల రూపాయలు చెల్లించాలని తీర్పు వేల్లడించినట్లు సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ ఒక ప్రకటనలో  తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube