రాజన్న సిరిసిల్ల జిల్లా: అమృతలాల్ శుక్లా కార్మిక భవనంలో పవర్లూమ్ ముఖ్య నాయకుల సమావేశం శనివారం నిర్వహించారు.ఈ సందర్భంగా పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు ముశం రమేష్ మాట్లాడుతూ పాలిస్టర్ కూలి పవర్లూమ్ కార్మికులకు ఒప్పందం ప్రకారంగా చెల్లించకుండా మీటరుకు 20 పైసల కూలీ తక్కువ చెల్లిస్తూ కార్మికుల శ్రమను యజమానులు దోచుకుంటున్నారని ఇది చాలా దుర్మార్గమైన చర్య అని అన్నారు.
ఈ విధానాన్ని యజమానులు వెంటనే మానుకోవాలని ఒప్పందం ప్రకారం 10 పీకులకు 25 పైసల కూలీ చెల్లించాలని అన్నారు.పెరుగుతున్న ధరలకు10 పీసులకు 25 పైసల కూలీ ఉంటేనే సరిపోని పరిస్థితిలో ఇంకా కూలి తగ్గిస్తే కార్మికుల కుటుంబాలు ఎలా బతుకుతాయి,నెలకు కనీసం 20,000 వేతనం వస్తే ఈరోజుల్లో కుటుంబాలు బతికే పరిస్థితిలో పవర్లూమ్ నడిపిస్తున్న కార్మికులకు తక్కువ కూలివలన నెలకు 10000 కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్నారు.
వారం రోజులు పని చేస్తే ఒకరోజు వేతనం తక్కువ కూలి కోల్పోవడం జరుగుతుందన్నారు.రోజుకు 100 రూపాయల చొప్పున కూలి తగ్గించి కార్మికుల శ్రమను దోచుకుంటున్నారు.
కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని, వేతనాలు సరిపోక బివండి, సూరత్ ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారు.
యజమానుల సంఘాలు మాత్రం ప్రకటనల ద్వారా కార్మికులకు కూలి తగ్గించలేదని తెలియజేస్తున్నారు.
ఈ రకంగా కార్మికులను అధికారులను ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారని ప్రభుత్వం కూడా వారు చెప్పే మాటలను నమ్మి యజమానుల పక్షాన నిలబడి వారి గురించే ఆలోచిస్తున్నది యారన్ డిపో ఏర్పాటు చేసి యజమానులకు ఎలాంటి పెట్టుబడి లేకుండా నూలు అందిస్తున్నది.కానీ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న నూలువల్ల కార్మికునికి ఎలాంటి లాభం లేకుండా పోయిందన్నారు.
కార్మికుని కూలి విషయంలో మాత్రం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం ప్రభుత్వ వస్త్రాల గురించి తీసుకోవడం లేదు.
ప్రభుత్వం యజమానులకు నూలు సరఫరా చేయడం ద్వారా ఎక్కువ లాభాలు యజమాలకు వచ్చే విధంగా చేసింది.
కానీ రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేస్తున్న కార్మికునికి ప్రభుత్వ వస్త్రానికి సరియైన వేతనం వచ్చే విధంగా కూలి నిర్ణయం చేయకుండా యజమాలు దయా ద్రాక్షల మీద వదిలిపెట్టుడు సరియైన విధానం కాదు వెంటనే ప్రభుత్వ వస్త్రానికి కూలి నిర్ణయం చేయాలి సెట్టింగ్ వస్త్రానికి మీటర్,మూడు రూపాయలు షూటింగ్ వస్త్రానికి మూడున్నర కూలి ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి,లేకుంటే ప్రభుత్వ వస్త్రాలను ఉత్పత్తి చేయడం నిలుపుదల చేస్తామని అన్నారు.కార్మికులు కూడా ఐక్యంగా ఉండి కూలీ సాధించుకోవాలని తక్కువ కూలీకి పని చేయవద్దని పాలిస్టర్ వస్త్రానికి అగ్రిమెంట్ ప్రకారంగా కూలి తీసుకోవాలని సరియైన కూలీ ఇవ్వని యజమానుల వద్ద సాంచల్ బంద్ పెట్టి లేబర్ అధికారికి లేకుంటే మన యూనియన్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని అన్నారు.
కార్మికులందరికీ ఐక్యంగా పెద్ద ఎత్తున పోరాటంలో పాల్గొంటేనే మన సమస్యలు పరిష్కారం జరుగుతాయని అన్నారు.ఈ సమావేశంలో యూనియన్ నాయకులు నక్క దేవదాస్, సిరిమల్లా సత్యం గుండు రమేష్, వెనగంటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.