ప్రస్తుత రోజుల్లో పిల్లల నుంచి పెద్దల వరకు నిద్ర నిర్లక్ష్యం చేస్తున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది.కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే నిద్ర నిర్లక్ష్యం( Sleeping Problems ) చేయడం వల్ల రోగాలను స్వయంగా ఆహ్వానించినట్లు అవుతుంది.
కంటి నిండా నిద్ర ఉంటే దాదాపు 90 శాతం జబ్బులకు దూరంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.అందుకే నిత్యం మంచిగా నిద్రపోయేందుకు ప్రయత్నించాలి.
అయితే మంచి నిద్ర కోసం పాటించాల్సిన అతి ముఖ్యమైన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నిద్ర సక్రమంగా పట్టాలి అంటే రాత్రుళ్లు కొన్ని కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి.ముఖ్యంగా టీ, కాఫీ, కూల్ డ్రింక్స్( Tea ), ఐస్ క్రీమ్స్, పెరుగు వంటి ఆహారాల జోలికి అస్సలు పోకండి.ఎందుకంటే ఇవి నిద్రను ఆలస్యం చేస్తాయి లేదా ఆటంకాన్ని కలిగిస్తాయి.
అలాగే మంచి నిద్ర కోసం టైమ్ ను ఫాలో అవ్వడం ఎంతో అవసరం.ప్రతిరోజు ఈ టైం కి కచ్చితంగా పడుకోవాలి అని రూల్ పెట్టుకోండి.
ఆ తర్వాత ఎన్ని పనులున్నా సరే పక్కన పెట్టి హాయిగా నిద్రపోండి.రాత్రి 10 గంటల తర్వాత మేల్కొని ఉండ కూడదు.
ఈ టైమ్‌ను పాటిస్తే చాలా బెటర్ అని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుత టెక్నాలజీ కాలం స్మార్ట్‌ఫోన్, టీవీ, ల్యాప్ టాప్ వంటి గడ్జెట్ల వినియోగం భారీగా పెరిగిపోయింది.నిద్ర సమయంలో కూడా వాటితోనే గడుపుతున్నారు.కానీ మంచి నిద్ర కోసం వాటిని పక్కన పెట్టాలి.
అది కూడా నిద్రపోవడానికి గంట ముందు నుంచి మొబైల్ ఫోన్( Mobile phone ) తో సహా సహా ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉండాలి.ఇక నిద్రపోయే ముందు అనవసరమైన విషయాలు ఆలోచిస్తూ బుర్రను పాడు చేసుకోవడం ఏమాత్రం మంచి కాదు.
దీని వల్ల మీ నిద్ర సమయం వేస్ట్ అవుతుంది.మీరు ఎంత ఆలోచించినా జరగాల్సిన పని జరగాల్సిన టైం కి జరుగుతుంది.
కాబట్టి ఆలోచనలను పక్కనపెట్టి ప్రశాంతంగా నిద్రపోండి.