విజయ్ సేతుపతి.తమిళనాడులో మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న నటుడు.
తమిళ టాప్ హీరోలు.అజిత్, విజయ్ దళపతితో సినిమాలు చేసేందుకు హీరోయిన్లు ఎంతగా ఆరాటపడతారో.
విజయ్ సేతుపతితో నటించేందుకు కూడా అంతే ఇష్టపడతారు.మామూలుగా అయితే హీరో పాత్రలు పోషించే వ్యక్తులు విలన్ క్యారెక్టర్లు చేయరు.
కానీ ఓ వైపు స్టార్ హీరోగా కొనసాగుతూనే.మరోవైపు స్టార్ విలన్ గానూ కొనసాగుతున్నాడు విజయ్ సేతుపతి.
ప్రస్తుతం తెలుగులో కూడా విజయ్ సేతుపతికి మంచి క్రేజ్ ఉంది.తాజాగా వచ్చి ఉప్పెన సినిమాతో ఆయన ఇక్కడి జనాలకు మరింత దగ్గర అయ్యాడ.ఉప్పెన సినిమాలో ఆయన నటనకు జనాలు ఫిదా అయ్యారు.తెలుగులో ఏమాత్రం ఛాన్స్ ఉన్నా విజయ్ ని ఇక్కడికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రస్తుతం ఆయన డేట్లు దొరకమే కష్టంగా ఉంది.ప్రస్తుతం ఆయన తెలుగులో పుష్ప, హిందీలో లాల్ సింగ్ చద్దా సినిమాలకు డేట్లు సరిపడక వదులుకున్నాడు.

మిగతా విషయాలు పక్కన పెడితే.అనబెల్ సేతుపతి అనే సినిమాను తను ఎలా ఒప్పుకున్నాడు అనేది ప్రస్తుతం ఆశ్చర్యంగా మారింది.ఈ సినిమా అంతా హారర్ కామెడీ నేపథ్యంలో కొనసాగుతుంది.కానీ ప్రేక్షకులు ఎక్కడా నవ్విన పరిస్థితి కనిపించలేదు.ఈ సినిమా అంతా ఓ లగ్జరీ హౌస్ లో దెయ్యాలు చేసే గొల మాత్రమే.ఈ సినిమాలో అసలు కథే లేదు అని చెప్పుకోవచ్చు.
విజయ్ స్థాయికి ఈ సినిమా కథ అస్సలు సూట్ కాదు.కానీ మొహమాటానికి ఈ సినిమా చేసినట్లే కనిపిస్తుంది.
ఇందులో నటించిన తాప్సీ పరిస్థితి కూడా అలాగే ఉంది.జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, రాధిక కూడా ఈ సినిమా చేసేందుకు ఎలా ఒప్పుకున్నారు అనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది.
మొత్తంగా ఈ సినిమా విజయ్ కెరీర్ లో పెద్ద చెత్త అని చెప్పుకోవచ్చు.వచ్చే సినిమాల విషయంలోనైనా విజయ్ సేతుపతి జాగ్రత్త పడతాడో లేదో చూడాలి.