అక్రమంగా భూమి రిజిస్ట్రేషన్ చేసి సస్టెన్షన్ లో ఉన్న తహాసిల్దార్ నరేష్ అరెస్ట్

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఓ మహిళకు చెందిన ఎకరం భూమిలో నుండి 36 గుంటల భూమిని మరొక వ్యక్తి పేరు మీదకి అక్రమంగా పట్టా చేసిన తహాసిల్దార్ నరేష్ ని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించడం జరిగిందని,నరేష్ మూడు కేసులలో ఉన్నాడని చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు.సీఐ కథనం ప్రకారం మండలంలోని మల్యాల గ్రామానికి చెందిన సంటి లస్మవ్వ కు గ్రామ శివారులో సర్వే నెంబర్ 322/4/1 లొ ఒక ఎకరం భూమి కలదు.

 Tehsildar Naresh Who Was Under Suspension After Illegally Registering The Land W-TeluguStop.com

గత 40 సంవత్సరాల నుండి సాగులో ఉన్నారు.భూమి సంబందించిన రైతుబంధు డబ్బులు కూడా వచ్చాయి.

గత రైతుబంధు డబ్బులు రాకపోగా, లస్మవ్వ కూతురు ప్రమీల అధికారులను సంప్రదించగా ధరణి పోర్టల్ నందు 40 గుంటలకు బదులు 06 గుంటల స్థలం మాత్రమే చూపించడంతో చందుర్తి రెవెన్యూ కార్యాలయంలో విచారణ చేయగా

మిగితా 34 గుంటల వ్యవసాయ భూమిని మల్యాల గ్రామానికి చెందిన గోంటి రాజానర్సు పై అప్పటి తహసీల్దార్ నరేష్ అక్రమంగా 2018-19 లో పట్టా మార్పు చేసినట్లు గుర్తిచింది.దింతో తన తల్లి లస్మవ్వ పేరుపై ఉన్న ఎకరం భూమిని అక్రమంగా పట్టా చేయించుకున్న గొంటి రాజనర్సు,పట్టా మార్పు చేసిన అప్పటి తహాసిల్దార్ నరేష్ తో పాటు అధికారులపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని లస్మవ్వ కూతురు సంటి ప్రమీల 27 నవంబర్ 2024 న చేసిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఇప్పటికే మూడు కేసుల్లో ఉండి సస్పెన్షన్ లో ఉన్న తహసీల్దార్ నరేష్ ని అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్ కు తరలించడం జరిగిందని,పట్టా మార్పు చేయించుకున్న గుంటి రాజనర్సు మృతి చెందినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా పట్టా చేసిన గతంలో చందుర్తి మండల తహసీల్దార్ గా పని చేసి రిటైర్డ్ అయిన ఇద్దరు పై రెండు కేసులు, నరేష్ పై మూడు కేసులు నమోదు కావడం జరిగిందన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube