రాజన్న సిరిసిల్ల జిల్లా: భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పేరొన్నారు.మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాని, దేశాన్ని తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించిన మహా ఆర్థిక మేధావి,కేంద్ర ఆర్థిక మంత్రిగా మన్మోహన్ చేసిన సేవలు దేశం ఎన్నటికి మరిచిపోదన్నారు.
నిజాయితీ, మంచితనం, సమర్థవంతంగా పని చేయడంలాంటివి మన్మోహన్ సింగ్ ను చూసి నేర్చుకోవాలన్నారు.ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రపంచంలోనే ఆర్థిక శక్తిగా నిలబెట్టిన ఘనుడు మన్మోహన్ సింగ్ అని తెలిపారు.
పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక శాఖ మంత్రిగా,అనంతరం పది సంవత్సరాలు ప్రధానిగా దేశానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు.పేద ప్రజలకు జాతీయ ఉపాధి హామీ పథకం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారని అన్నారు.
మేధావి, మితభాషి, సౌమ్యుడు, స్థిత ప్రజ్ఞత కలిగిన నేతగా మన్మోహన్ సింగ్ మన యువతరానికి ఆదర్శం అన్నారు.మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటుటని వారి నిరాడంబర జీవితం, దేశం పట్ల వారి అంకిత భావం భావితరాలకు స్ఫూర్తి దాయకం అన్నారు.
ఆ మహనీయుని ఆత్మకు శాంతి ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.