బిజెపి ఎమ్మెల్సీ విజయం పట్ల బిజెపి శ్రేణుల విజయోత్సవ సంబరాలు.

ఎల్లారెడ్డిపేట: భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఘన విజయం సాధించడం పట్ల శుక్రవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బిజెపి శ్రేణులు విజయోత్సవ సంబరాలు చేశారు.ఈ హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి ఏవిఎన్ రెడ్డి విజయం సాధించిన సందర్భంగా ఎల్లారెడ్డిపేట భారతీయ జనతా మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల ఉపాధ్యక్షుడు సింగారవేణి కృష్ణ హరి నేతృత్వంలో టపాసులు పేల్చి మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు.

 Bjp Ranks Celebrate Victory Over Bjp Mlc's Victory, Bjp , Mlc Elections, Yellar-TeluguStop.com

ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజలు విశ్వాసం కోల్పోయారని రానున్న రోజులలో ఎన్నికలు ఎప్పుడు జరిగిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ ఎల్లారెడ్డిపేట పట్టణ అధ్యక్షులు నేవూరి శ్రీనివాస్ రెడ్డి, బొడవత్ రవీందర్ నాయక్, శ్రీకాంత్, అనూష్, సురేష్, పరశురాములు,భరత్, సాయి, కార్తీక్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube