ఈ రోజుల్లో మధుమేహం, గుండెపోటు,( Heart attack ) క్యాన్సర్, ఊబకాయం వంటి జబ్బులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి.మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, చెడు వ్యసనాలు.
ఇందుకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.ఏదేమైనప్పటికీ ఈ జబ్బులకు దూరంగా ఉండాలంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ ఎంతో అవసరం.
అయితే ఆయా జబ్బులను అడ్డుకునేందుకు కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా సహాయపడతాయి.అటువంటి వాటిలో ఇప్పుడు చెప్పబోయే హెర్బల్ వాటర్ ( Herbal water )కూడా ఒకటి.
రోజు ఉదయం ఈ వాటర్ తాగితే మధుమేహం( Diabetes ), గుండె పోటు, క్యాన్సర్ వంటి ఎన్నో జబ్బులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.మరి ఇంతకీ ఆ వాటర్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా మూడు నుంచి నాలుగు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని శుభ్రంగా పొట్టు తొలగించి కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాసు వాటర్ పోసుకోవాలి.
వాటర్ హీట్ అవ్వగానే అందులో దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, వన్ టేబుల్ స్పూన్ ధనియాలు, వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మరిగించాలి.
దాదాపు పది నుంచి పదిహేను నిమిషాల పాటు వాటర్ ను మరిగించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.రోజు ఉదయం ఈ హెర్బల్ వాటర్ ను తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.
ఈ హెర్బల్ వాటర్ లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మన బాడీని డీటాక్స్ చేస్తాయి.శరీరంలో పేరుకుపోయిన వ్యర్ధాలను తొలగిస్తాయి.అలాగే ఈ హెర్బల్ వాటర్ తాగితే బ్యాడ్ కొలెస్ట్రాల్ కలుగుతుంది.గుండెకు ముప్పు తగ్గుతుంది.
అంతేకాదు ఈ హెర్బల్ వాటర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల అధిక రక్తపోటు ( High blood pressure )అదుపులో ఉంటుంది.మధుమేహం క్యాన్సర్( Cancer ) వంటి జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.
అధిక బరువు సమస్య దూరం అవుతుంది.ఎముకల సాంద్రత పెరుగుతుంది.
జలుబు దగ్గు వంటి సమస్యలు ఉంటే తగ్గు ముఖం పడతాయి.మరియు ఒత్తిడి డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు సైతం పరార్ అవుతాయి.