రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో “స్వచ్ఛదనం- పచ్చదనం” కార్యక్రమం నిర్వహించారు.కళాశాలలోని వాటర్ ట్యాంక్ల చుట్టూ విద్యార్థులు పరిశుభ్రం చేసి కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్లారెడ్డిపేట ఎం.పి.డి.ఓ సత్తయ్య పాల్గొని మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడం ద్వారా కాలుష్యం తొలిగిపోతుందనీ, పరిశుభ్రమైన ఆక్సిజన్ లభిస్తుందని,వాతావరణంలో వేడి తీవ్రత తగ్గుతుందనీ పర్యావరణానికి మేలు జరుగుతుందని అన్నారు.
చెట్లు లేకపోతే ఏ జీవరాశి బ్రతుకదనీ మానవ మనగడ కొనసాగదనీ మొక్కలు పెంచాలనీ పచ్చదనం నింపాలనీ కోరారు.
ఈ కార్యక్రమంలో ఎం.పి.డి.ఓ సత్తయ్య, ప్రిన్సిపాల్ జి.వనజ కుమారి, జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ అధికారి వాసరవేణి పర్శరాములు, ఉపన్యాసకులు క్యాతం సత్యనారాయణ, మాదాసు చంద్రమౌళి, చెరుకు భూమక్క, బుట్ట కవిత, నీరటి విష్ణు ప్రసాద్, ఆర్.గీత, కొడి ముంజ సాగర్, అగోలం గౌతమి, చిలుక ప్రవళిక, మంచాల గణేష్, యోగేష్, బి.మోహన్ , జి.రాజశేఖర్ బోధనేతర సిబ్బంది విమల్ కుమార్, ఎం.డి తాజోద్దిన్, షాహినా సుల్తానా విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.