ఉల్లిపాయలు(ఆనియన్స్).నిత్యం వంటల్లో వీటిని వాడుతూనే ఉంటాము.రుచి, వాసన ఘాటుగా ఉన్నా.పోషకాలు మాత్రం మెండుగా ఉంటాయి.అందుకే ఆరోగ్యపరంగా ఉల్లిపాయలు అనేక ప్రయోజనాలు అందిస్తాయి.అలాగే జుట్టు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.
ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ ఆనియన్ హెయిర్ సీరమ్‌ను వాడితే గనుక వివిధ రకాల జుట్టు సంబంధిత సమస్యలను నివారించుకోవచ్చు.అదేసమయంలో జుట్టును ఒత్తుగా పొడవుగా మార్చుకోవచ్చు.
మరి ఇంకెందుకు లేటు ఉల్లిపాయతో హెయిర్ సీరమ్‌ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందు రెండు ఉల్లిపాయలు తీసుకుని తొక్క తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో గ్లాస్ వాటర్ పోయాలి.
వాటర్ హిట్ అవగానే అందులో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల అవిసె గింజలు వేసి పది నిమిషాల పాటు ఉడికిస్తే.జెల్లీ స్ట్రక్చర్ లోకి మారుతుంది.
అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పల్చటి వస్త్రం సాయంతో జెల్‌ను వేరు చేయాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల అవిసె గింజల జెల్ ను వేసుకోవాలి.
అలాగే అందులో నాలుగు టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ రసం, రెండు టేబుల్ స్పూన్ల కోకనట్ ఆయిల్ వేసి ఐదారు నిమిషాల పాటు స్పూన్ తో బాగా మిక్స్ చేసుకుంటే ఆనియన్ హెయిర్ సీరమ్ సిద్ధమయినట్టే.
ఈ సీరమ్‌ను ఒక బాటిల్ లో నింపుకుని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలి.నైట్ నిద్రించే ముందు ఈ సీరమ్‌ను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా అప్లై చేసి నిద్రించాలి.మరుసటి రోజు ఉదయం మైల్డ్ షాంపూ ని యూస్ చేసి తలస్నానం చేయాలి.
వారంలో రెండు సార్లు ఇలా చేస్తే చుండ్రు పోతుంది.హెయిర్ ఫాల్ తగ్గుతుంది.
మరియు జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.