వర్షాకాలంలో ఏవి ఎక్కువ తినాలి.. ఏవి అస్సలు తినకూడదో తెలుసా?

వర్షాకాలం ( Rainy season )రానే వచ్చింది.గత వారం రోజుల నుంచి నిత్యం వర్షాలు పడుతూనే ఉన్నాయి.

 Do You Know What To Eat And What Not To Eat In Monsoon, Monsoon, Monsoon Foods,-TeluguStop.com

అయితే ఈ వర్షాకాలంలో ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ ఎంతో అవసరం.పొరపాటున నిర్లక్ష్యం చేశారంటే అనేక జ‌బ్బులు చుట్టుముట్టేస్తాయి.

వర్షాకాలంలో అంటు వ్యాధులు, విషజ్వరాల వ్యాప్తి చాలా అధికంగా ఉంటుంది.అలాగే ఎన్నో చర్మ సంబంధిత సమస్యలు సైతం కలవర పెడుతుంటాయి.

అందుకే హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఏది పడితే అది తినేస్తే జబ్బులను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది.

అందువల్ల వర్షాకాలంలో ఏవి ఎక్కువ తినాలి.ఏవి అస్సలు తినకూడదు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Tips, Healthy Foods, Latest, Monsoon, Monsoon Foods, Rainy Season-Telugu

చాలా మంది వర్షాకాలంలో చేసే పొరపాటు ఏంటంటే చల్లగా ఉంది కదా అని వాటర్ తాగడం మానేస్తుంటారు.ఇది చాలా పొరపాటు.ఏ కాలమైనా సరే శరీరానికి అవసరమయ్యే నీటిని అందించాలి.బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి.సీజనల్ గా దొరికే పండ్లను డైట్ లో చేర్చుకోవాలి.దానిమ్మ,( Pomegranate ) పియర్స్, చెర్రీస్, యాపిల్, నేరేడు తదితర పండ్లు ఈ సీజన్లో ఎక్కువగా లభిస్తుంటాయి.

వీటిని రోజూ తీసుకోవాలి.

Telugu Tips, Healthy Foods, Latest, Monsoon, Monsoon Foods, Rainy Season-Telugu

వర్షాకాలంలో మిరియాలు,( Pepper ) దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు తదితర స్పైసెస్ ను డైట్ లో చేర్చుకోవాలి.వీటిలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ వంటి లక్షణాలు ఇమ్యూనిటీ సిస్టమ్ ను బూస్ట్ చేస్తాయి.తద్వారా సీజనల్ గా వచ్చే వ్యాధులను అడ్డుకునేందుకు తగిన సామర్థ్యం ఉంటుంది.

నిత్యం గుప్పెడు నట్స్ ను డైట్లో చేర్చుకోవాలి.నట్స్ మిమ్మల్ని రోజంతా ఎనర్జిటిక్ గా ఉంచుతాయి.

అనేక జబ్బులను దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకుంటాయి.ఈ సీజన్ లో కూరగాయలు, వేడివేడి సూప్స్, ఉడికించిన గుడ్డు, హెర్బల్ టీ లు వంటివి తీసుకోవాలి.

ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.అనేక జబ్బుల నుంచి కాపాడతాయి.

ఇక వర్షాకాలంలో వేటిని అవాయిడ్ చేయాలి అనేది కూడా తెలుసుకుందాం.ప్రస్తుత సీజన్ లో బయట ఆహారాలు పొరపాటున కూడా తీసుకోరాదు.

వేయించిన ఆహారాలను కంప్లీట్ గా అవాయిడ్ చేయండి.ఉడికి ఉడకని మాంసం, చేపలు, కడగని కూరగాయలను అసలు తీసుకోరాదు.

కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, షుగర్, షుగ‌ర్‌ తో తయారు చేసిన స్వీట్స్ ను కూడా దూరం పెట్టండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube