మరో మూడు రోజుల్లో పవన్, సాయితేజ్ కాంబినేషన్ లో సముద్రఖని డైరెక్షన్ లో తెరకెక్కిన బ్రో మూవీ( Bro Movie ) రిలీజ్ కానుంది.ఈ సినిమా బుకింగ్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఈ మూవీ బుకింగ్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.
ఈ సినిమా నిడివి కేవలం 130 నిమిషాలు కావడంతో సినిమాలో పవన్( Pawan Kalyan ) పాత్ర స్క్రీన్ పై ఎంతసేపు కనిపించనుందనే చర్చ సైతం జోరుగా జరుగుతుండటం గమనార్హం.
సాయితేజ్( Saitej ) ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా షాకింగ్ విషయాన్ని వెల్లడించగా ఆ విషయం వైరల్ అవుతోంది.
బ్రో మూవీకి సంబంధించి కేక్ తినిపించే సీన్ లో నేను బాగా ఇబ్బంది పడ్డానని సాయితేజ్ అన్నారు.ఆ తర్వాత నేను బాగా ఇబ్బంది పడిన సీన్ డ్రింక్ సీన్ అని సాయితేజ్ కామెంట్లు చేశారు.
పవన్ కళ్యాణ్ ముందు తాగుతూ నటించాల్సిన సీన్ అది అని సాయితేజ్ వెల్లడించారు.

మొదట పవన్ ముందు తాగుతూ నటించడానికి ఇబ్బంది పడినా ఆ సీన్ బాగా వచ్చిందని సాయితేజ్ అన్నారు.సీన్ పూర్తైన తర్వాత పవన్ కళ్యాణ్ నా దగ్గరకు వచ్చి తాగి సెట్స్ కొచ్చావా అని అడిగారని సాయితేజ్ చెప్పుకొచ్చారు.నేను లేదని చెప్పగా సీన్ లో బాగా చేశావని మామయ్య మెచ్చుకున్నారని సాయితేజ్ కామెంట్లు చేశారు.
తాగుడు మీద మంచి పట్టుందంటూ పవన్ ఆట పట్టించారని సాయితేజ్ అన్నారు.

బ్రో సినిమాలోని ఈ సన్నివేశం నాకు కూడా ఎంతో నచ్చిందని సాయితేజ్ పేర్కొన్నారు.సాయితేజ్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు ఫ్యాన్స్ కు ఎంతగానో నచ్చేశాయి.విరూపాక్ష సినిమాతో( Virupaksha ) హిట్ అందుకున్న సాయితేజ్ బ్రో సినిమాతో అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తారేమో చూడాల్సి ఉంది.
సాయితేజ్ తర్వాత సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.బ్రో సినిమా తర్వాత ఆరు నెలల పాటు సాయితేజ్ షూటింగ్ లకు దూరంగా ఉండనున్నారు.







