కరోనా వైరస్ ని తరిమికొట్టే నేల వేము ఆకు.. మీకు తెలుసా?

మిరప చెట్టును పోలి ఉండే నేల వేము ఆకు గురించి తెలియని వారు ఎవరూ ఉండరు.ఇది మన చుట్టూ పరిసర ప్రాంతాల్లో విపరీతంగా పెరుగుతుంది.

 Amazing Health Benefits Of Nela Vemu Leaves Details,nela Vemu Leaves, Good For H-TeluguStop.com

కానీ ఈ నేల వేము వల్ల ఎన్ని ఆరోగ్యప్రయోజనాలున్నాయి బహుశా ఎవరికీ తెలియక పోవచ్చు.ఈ నేల వేము ఆకు ను తీసుకోవడం ద్వారా లేదా కషాయంగా చేసుకుని తాగడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

మరి ఆ ఆరోగ్య ప్రయోజనాలను ఇక్కడ తెలుసుకుందాం.

నేలవేము పూర్వం నుంచి విరివిగా వాడుతున్న ఔషధ మొక్కలలో ఒకటి.

నేలవేము వేపాకు కన్నా చాలా చేదుగా ఉంటుంది.ఇందులో ఆకులలోనూ, కాండంలోనూ ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.

పూర్వం నేల వేమును నేల వేప అని పిలిచేవారు.వారు అలా ఎందుకు పిలిచేవారు అంటే వేపలో ఉండే అన్ని ఔషధ గుణాలు ఈ నేల వేములో కూడా ఉన్నాయి.

ఈ నేలవేము ఒక కోర్సు లాగా రోజూ రెండు మూడు ఆకులు తినడం ద్వారా మనకు పాము గాని, తేలు గాని కరిచినా విషం ఎక్కదు.మధుమేహం తో బాధపడేవారు, ఈ నేల వేము ఆకు ను చూర్ణంగా చేసుకొని తీసుకోవడం ద్వారా మధుమేహ వ్యాధిని అరికట్టవచ్చు.

ఈ నేలవేము ఆకు పచ్చ కామెర్లను ఒక వారంలో పూర్తిగా తగ్గిస్తుంది.

Telugu Asthma, Ayurvedic, Corona, Corona Treat, Cough, Problems, Nela Vemu-Telug

నేలవేము ఆకులను బాగా మరిగించి ఆ కషాయాన్ని తీసుకోవడం ద్వారా జ్వరం నుంచి ఉపశమనం కలుగుతుంది.నేలవేము రక్తాన్ని శుద్ధి చేసి రక్తంలోని విష పదార్థాలను బయటకు పంపుతుంది.దీని ద్వారా చర్మ వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

సాధారణంగా వర్షాకాలం మొదలవగానే అందరికి దగ్గు, జలుబు మొదలవుతుంది.వీటికి చికిత్స నేలవేము ఆకు కషాయం తాగడం ఉత్తమం.

Telugu Asthma, Ayurvedic, Corona, Corona Treat, Cough, Problems, Nela Vemu-Telug

అంతేకాదు కరోనా వైరస్ ని తరిమికొట్టే శక్తి ఈ ఆకులో ఉందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.అలానే దగ్గు, జ్వరం, జలుబు వంటివి తరిమి    కొడుతుందని.అంతే కాకుండా ఆస్తమాతో బాధపడేవారు ఈ కషాయం తాగడం వల్ల మంచి ఉపశమనం కలుగు తుందని చెప్పారు.నేలవేము ఆకును ప్రతి రోజు తినడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

అంతేకాకుండా గ్యాస్ట్రిక్ అల్సర్ల నుంచి ఉపశమనం కలిగి జీర్ణక్రియ రేటును మెరుగుపరుస్తుందిని నిపుణులు చెప్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube