పుచ్చ గింజలు( Watermelon Seeds ) ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.పుచ్చ గింజల్లో విటమిన్స్, మినరల్స్ తో పాటు అనేక పోషకాలు నిండి ఉంటాయి.
రోజుకు రెండు స్పూన్లు పుచ్చ గింజలు తినడం వల్ల గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చు.రక్తపోటు అదుపులో ఉంటుంది.
రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది.స్త్రీ పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది.
ఇలా చెప్పుకుంటూ పోతే ఆరోగ్యపరంగా పుచ్చ గింజలు అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి.అయితే ఆరోగ్యానికి మాత్రమే కాదు పుచ్చ గింజలతో చర్మానికి సైతం మెరుగులు పెట్టవచ్చు.
ఇవి అందాన్ని పెంచడానికి సహాయపడతాయి.పుచ్చ గింజలను ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడారంటే మీ ముఖ చర్మం తెల్లగా మృదువుగా మరియు అందంగా మెరిసిపోతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం పుచ్చ గింజలను చర్మానికి ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ పుచ్చ గింజలు వేసి ఒక కప్పు వాటర్ పోసి నానబెట్టుకోవాలి.నాలుగు గంటల తర్వాత నానబెట్టుకున్న పుచ్చ గింజలను మిక్సీ జార్ లో వేసి స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ పెరుగు మరియు వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.పుచ్చగింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ( Antioxidants )మరియు ఆరోగ్యమైన కొవ్వులు చర్మానికి చక్కని పోషణ అందిస్తాయి.స్కిన్ టోన్ ను పెంచుతాయి.
అదే సమయంలో డ్రై స్కిన్ సమస్యను దూరం చేసి చర్మాన్ని తేమగా ఉంచుతాయి.ఇప్పుడు చెప్పుకున్న రెమెడీని రెండు రోజులకు ఒకసారి పాటించారంటే మీ ముఖ చర్మం తెల్లగా మృదువుగా మెరిసిపోతుంది.
అందంగా, యవ్వనంగా కనిపిస్తుంది.