ఈమధ్య కాలంలో చాలామంది మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్ల వల్ల ఎన్నో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.మరి ముఖ్యంగా వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద అనే తేడా లేకుండా షుగర్, బీపీ ( Sugar, BP )లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.
అయితే వీటికి కారణం బయట తినే ఆహార పదార్థాలే అని వైద్య నిపుణులు చెబుతున్నారు.అయితే కొన్ని ఆహారాలు తీసుకుంటే వీటిని అదుపులో ఉంచవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్య పరిరక్షణ కోసం పండ్లు తినాలని ప్రతి ఒక్కరు కూడా సూచిస్తారు.అధిక బీపీ సమస్యతో బాధపడుతున్న వారు లీచి పండు( Lychee fruit )ను తినాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అయితే ఈ పండు తినడం వల్ల బీపీ సమస్య దూరం కావడంతో పాటు శరీరానికి కూడా చాలా మేలు జరుగుతుంది.అయితే వేసవికాలంలో లిచీ పండు తింటే చాలా మేలు జరుగుతుంది.
ఎందుకంటే లిచీ పండు అంటే సోప్ బెర్రీ కుటుంబానికి చెందినది.ఈ పండు లోపల తెల్లగా, జ్యూసీ గా ఉంటుంది.
అలాగే ఇది తీపి, పులుపు రుచిని కలిగి ఉంటుంది.ఎక్సోటిక్ లిచీలో అనేక రకాల మొక్కల ఆధారిత సమ్మేళనాలు ఉన్నాయి.

అయితే ఈ పండ్లు విటమిన్లు, మినరల్స్ శరీరానికి అనేక ప్రయోజనాలు కలిగిస్తాయి.ఎందుకంటే లిచీ పండులో ఎపికాటేచిన్, రూటిన్, మొక్కల భాగాలు, ఆక్సికరణతో పాటు దీర్ఘకాలిక అనారోగ్యాలు, అంధత్వం, మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన జబ్బులు నివారించడానికి సహాయపడుతుంది.ఈ పండులోని రాగి కంటెంట్ జుట్టు అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది.అలాగే ఇందులో గ్లైసేమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది.

అందుకే ఇది రక్తంలో చక్కెర స్థాయిని నిరోధిస్తోంది.3ఈ పండును తినడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.ఎందుకంటే ఈ పండు లో విటమిన్ సి అధికంగా ఉంటుంది.అలాగే ఆంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి.ఇది మన శరీరంలో ఉన్న సూక్ష్మజీవుల నుండి మన శరీరాన్ని కాపాడుతుంది.ఇక దీర్ఘకాలిక వ్యాధులను కూడా నివారిస్తుంది.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.అలాగే ఈ పండును తీసుకోవడం వలన అధిక బీపీ కూడా నియంత్రణలో ఉంటుంది.