జనసేన పార్టీలో ఒకే ఒక్క ఎమ్యెల్యేగా ఉన్న రాపాక వరప్రసాద్ వ్యవహారం ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది.ఆయన పార్టీలోనే ఉన్నా పార్టీకి వ్యతిరేకంగా గళమెత్తుతుండడం, అదేపనిగా వైసీపీ అధినేత, సీఎం జగన్ ను పొగుడుతుండడం చూస్తుంటే ఆయన పార్టీలో ఉండడం కష్టమే అన్న భావం అందరిలోనూ వ్యక్తం అవుతోంది.
అయితే రాపాక మాత్రం తాను జనసేనలోనే ఉంటాను వైసీపీలో చేరాను అని చెబుతున్నాడు.కానీ ఆయన వ్యవహారాలన్నీ మాత్రం వైసీపీకి దగ్గరయ్యే ప్రయత్నాల్లో భాగంగానే అన్నట్టుగా కనిపిస్తోంది.
అయితే ఇక్కడే రాపాక మాస్టర్ ప్లాన్ ఏంటో మెల్లి మెల్లిగా అర్ధం అవుతోంది.ఆయన జనసేనలో ఉంటూనే జగన్ ను పొగుడ్తూ ఉండడం ద్వారా జనసేన ఆగ్రహానికి గురయ్యి పార్టీ తనను సస్పెండ్ చేసేలా చేసుకోవాలని చూస్తున్నట్టుగా అర్ధం అవుతోంది.

జనసేన నుంచి నేరుగా వైసీపీలో చేరిపోతే ఎక్కడలేని ఇబ్బందులు వచ్చిపడతాయని భావిస్తున్న రాపాక ఆలోచిస్తున్నారు.నేరుగా విఏసీపీలో చేరడము అంటే పార్టీలోకి వచ్చి చేరే నాయకులు ఎవరైనా పార్టీకి రాజీనామా చేసి రావాల్సిందే అంటూ షరతు విధించడంతో ఆలోచనలో పడ్డారు.ఒకవేళ రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లడం రాపాకకు అస్సలు ఇష్టం లేదు.అదీకాకుండా తన గెలుపు కోసం అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందించిన మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజు జనసేనను వదిలి వైసీపీలో చేరిపోవడం తో రాపాక రాజకీయ భవిష్యత్తు గందరగోళంలో పడింది.

మరోవైపు తన రాజకీయ ప్రత్యర్థి బొంతు రాజేశ్వరరావు గత ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని రాపాక ఎన్నిక చెల్లదంటూ కోర్టుకి ఎక్కడం కూడా రాపాకను ఇబ్బందులకు గురిచేస్తోంది.ఇవన్నీ ఆలోచించే అధికార పార్టీకి దగ్గరవ్వాలని ఒక నిర్ణయానికి వచ్చేసారు.దీనిలో భాగంగానే జనసేనలో ఉంటూనే అధికార పార్టీని పొగుడుతూ తన సొంత పార్టీని కవ్వించే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.ఈ మధ్యకాలంలో పవన్ కు రాపాకకు మధ్య దూరం పెరుగుతూ వస్తోంది.
పవన్ నిర్వహిస్తున్న సభలు, సమావేశాల్లోనూ ఆయన పాల్గొనడంలేదు.అసెంబ్లీ సమావేశాల్లో టిడిపి సస్పెండ్ చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని సభలో ప్రత్యేక సభ్యుడిగా స్పీకర్ తమ్మినేని సీతారాం గుర్తించడంతో రాపాకలో మార్పు వచ్చింది.
అందుకే పార్టీ తనను ఎప్పుడు సస్పెండ్ చేస్తుందా అని ఎదురుచూపులు చూస్తున్నాడు.