తినే ఆహారం రుచిగా ఉండాలంటే కారం తో పాటు తగినంత ఉప్పు ఉండాలి.ఉప్పు లేని ఆహారం చప్పగా ఉంటుంది.
అలాగని మోతాదుకు మించితే అసలు తినలేము.అందుకే ఉప్పు ఎంత అవసరమో అంతే ఉపయోగించాలి.
అప్పుడే వంట రుచిగా ఉంటుంది.అయితే వంటలలో ఉప్పు ఉపయోగం పెరిగితే ఆరోగ్యం పై చెడు ప్రభావం పడుతుంది.
దీని వల్ల రక్తపోటు( Blood pressure ) పెరుగుతుంది.దీంతో గుండె ఆరోగ్యం( Heart health ) దెబ్బతింటుంది.
అందుకే ఉప్పు వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు.

అలాగే ప్రాసెస్డ్ ఫుడ్స్( Processed Foods ) తినడం బాగా తగ్గించాలి.ముఖ్యంగా శుద్ధి చేసిన మాంసాహారం పూర్తిగా మానేయాలి.ఎందుకంటే వాటిలో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
ఇది ఆరోగ్యానికి హాని చేస్తుంది.వీటిని తరచుగా తింటే బీపీ పెరగవచ్చు.
వీటికి బదులుగా తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు లాంటి ఆహార పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవాలి.కొన్ని రకాల ఆహారాలకు బదులుగా అదనపు రుచి కోసం టమాటా సాస్, సొయా సాస్ వంటివి ఉపయోగిస్తూ ఉంటారు.
అయితే ఈ రెగ్యులర్ సాసేజ్‌ల్లో శరీరానికి హాని కలిగించే మొత్తంలో ఉప్పు ఉంటుంది.

అందుకే వీటిని వినినంతవరకు దూరంగా పెట్టడం మంచిది.ఉప్పుతో వేయించిన సాల్ట్ ఫుడ్స్ తినే అలవాటు ఉంటే వెంటనే దూరం చేసుకోవడం మంచిది.ఎందుకంటే వీటిలో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
ఇది రక్తపోటు పెరగడానికి కారణం అవుతుంది.అలాగే ఇంట్లో భోజనం తయారు చేసేటప్పుడు ఉప్పును తగినంతగా ఉపయోగించాలి.
షాపింగ్ చేసే సమయంలో ఫుడ్ ప్రొడక్ట్స్ కొనే ప్రతిసారి వాటి లేబుల్స్ ను పరిశీలించాలి.ఎందుకంటే వాటిలో సోడియం కంటెంట్ మొత్తం ఎంత శాతం ఉందో ప్యాకేజీ పై లిస్టు చేసి ఉంటుంది.
అలాగే బిపి హెచ్చుతగ్గులకు ప్రతిసారి ఆహారం, ఉప్పు కారణం కాకపోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.