ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో మాజీ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( Former Minister KTR ) కీలక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ వచ్చింది.కరవు తెచ్చిందని కేటీఆర్ విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt )పై రాష్ట్ర ప్రజలు తీవ్ర వ్యతిరేకత చూపిస్తున్నారని పేర్కొన్నారు.రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి చేయలేదని మండిపడ్డారు.
రైతులు కర్రుకాల్చి వాత పెడతారనే ఆగస్టులో రుణమాఫీ అంటున్నారన్న కేటీఆర్ పార్టీని వీడే నేతల గురించి బాధపడే అవసరం లేదని తెలిపారు.రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ప్రభుత్వాన్ని కూల్చే అవసరం తమకు లేదని చెప్పారు.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని కేటీఆర్ వెల్లడించారు.







