నా ఫాలోవర్స్ అంతా ఫేక్... పుసుక్కున నోరు జారిన పూజ హెగ్డే!

పూజా హెగ్డే( Pooja Hegde ) పరిచయం అవసరం లేని పేరు.స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలో ఓవెలుగు వెలిగిన పూజా హెగ్డే అనంతరం అవకాశాలను కోల్పోయారు.

 Pooja Hegde Sensational Comments On Instagram Fallowers , Pooja Hedge, Retro, Su-TeluguStop.com

అయితే తిరిగి ఈమె ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ సినిమాల షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం పలు సినిమాలో షూటింగ్ పనులలో బిజీగా ఉన్న పూజ హెగ్డే త్వరలోనే రెట్రో,( Retro ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

సూర్య( Suriya ) పూజా హెగ్డే జంటగా నటించిన ఈ సినిమా వచ్చేనెల 1వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పూజా హెగ్డే వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

Telugu Pooja Hedge, Poojahedge, Retro, Suriya, Suriya Retro-Movie

ఇలా ఓ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు ఉండే ఫాలోవర్స్ ( Followers ) గురించి ఈమె ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.సాధారణంగా హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటారు.హీరోలు ఎంత పెద్ద స్టార్స్ అయినప్పటికీ హీరోయిన్లను మించిన ఫాలోవర్స్ వారికి ఉండరు.అయితే ఇలా హీరోయిన్లకు ఉండే ఫాలోవర్స్ అందరూ కూడా ఫేక్ అంటూ ఈమె చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.

Telugu Pooja Hedge, Poojahedge, Retro, Suriya, Suriya Retro-Movie

ఈ విషయం గురించి పూజా హెగ్డే మాట్లాడుతూ తనకు ఇంస్టాగ్రామ్ లో సుమారు 38 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారని తెలిపారు.కానీ నా సినిమాని అంతమంది ఆడియన్స్ థియేటర్స్ లో చూడరు.నాకు ఉన్నటువంటి ఫాలోవర్లు పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ కి కూడా లేరు.నాకే కాదు, చాలా మంది హీరోయిన్స్ కి బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ కంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు అయితే వారంత నిజమైన అభిమానులు కాదని తెలిపారు.

కేవలం మేము పెట్టే కంటెంట్ ని బట్టి వచ్చే వాళ్ళు అంటూ ఫాలోవర్స్ గురించి పూజా హెగ్డే చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube