కలలు అందరూ కంటారు కానీ కొందరు మాత్రమే వాటిని నిజం చేసుకుంటారు.కల కనడానికి ఇమాజినేషన్ చేసుకునే సదుపాయం ఉంటె సరిపోద్ది కానీ దాన్ని నిజం చేయాలంటే కష్టపడాలి.
అలా కష్టపడి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న అమ్మాయే మోనిత.ఆమె అసలు పేరు శోభాశెట్టి.
తను కన్నడ అమ్మాయి.ఆమె బెంగళూర్ లోనే పుట్టి పెరిగింది.
ఆమె ఎమ్మెస్సీ కంప్లీట్ చేసింది.శోభాశెట్టి అంటే ఇప్పుడు ఎవరికీ తెలియదు మోనిత అంటేనే అందరు గుర్తుపడతారు.
మోనితకి అంత పేరు రావడానికి కార్తీక దీపం సీరియల్ లో తాను చేసిన మోనిత క్యారక్టరే.అది నెగటివ్ క్యారక్టరే అయినా చాలా సింపుల్ గా చేసేసింది తను.మోనితకి చిన్నప్పట్టినుంచి యాక్టింగ్ అంటే ప్రాణం.అందుకే తను కన్నడలో ప్రసారమయ్యే అగ్నిసాక్షి సీరియల్ లో నటిస్తునప్పుడు మంచి గుర్తింపు వచ్చింది.
ఎన్ని సీరియల్స్ చేసిన ఎంత గుర్తింపు వచ్చిన వెండితెరపై కనిపించాలని చాలామందికి ఉంటుంది.మోనితకి కూడా అలానే అనిపించింది.అగ్నిసాక్షి సీరియల్ కి మంచి గుర్తింపు రాగానే కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంజనీపుత్ర మూవీలో పునీత్ కి చెల్లెలుగా చేసే ఛాన్స్ వచ్చింది.ఆ వచ్చిన ఛాన్స్ ని మిస్ చేసుకోకుండా ఆ మూవీ లో ఆక్ట్ చేసింది.
అయితే డేట్స్ అడ్జెస్ట్ చేయలేక అగ్నిసాక్షి సీరియల్ నుండి తప్పుకుంది.అంజనీపుత్ర మూవీ కి గాను మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తెలుగులో అష్టాచమ్మా సీరియల్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.అలాగే కార్తీకదీపం సీరియల్ ఛాన్స్ వచ్చింది.
కానీ అది నెగటివ్ రోల్ వంటలక్కని కార్తిక్ ని విడగొట్టే క్యారక్టర్.డాక్టర్ బాబుని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి అనుకునే క్యారక్టర్.
ఆ క్యారక్టర్ లో కూడా తను జీవించేసింది.వంటలక్క డాక్టర్ బాబులకి ధీటుగా ఆక్టింగ్ చేస్తూ వస్తుంది.
కార్తీకదీపంలో ఆక్టింగ్ కి గాను బెస్ట్ విలన్ గా అవార్డు కూడా అందుకుంది మోనిత.కార్తీకదీపం సీరియల్ చూస్తూ జనాలు తనను తిట్టుకుంటుంటే తను ఎంత బాగా ఆ క్యారక్టర్ చేసానా అని తనకు తానే మురిసిపోతుందట.
తను నవరసాలని పోషించగలనని చెప్పకనే చెపుతుంది.
మోనిత అలా వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టకుండా డే బై డే తనని తాను ఇంప్రూవ్ చేసుకుంటుంది.మోనిత అక్టింగ్ స్కిల్స్ బుల్లితెర ప్రేక్షకులకి చూపిస్తూ వాళ్ళతో శబాష్ అనిపించుకుంటుంది.అలాగే లాహిరి లాహిరి లాహిరిలో, సీతమ్మవాకిట్లోసిరిమల్లెచెట్టు లాంటి సీరియల్స్ లో నటిస్తూ పాజిటివ్ క్యారక్టర్స్ చేస్తూ తనకంటూ మంచి గుర్తింపుని సొంతం చేసుకుంటుంది.
తను ఏ సీరియల్ చేసిన తనకు ఇప్పటివరకు కార్తీకదీపం సీరియల్ అంటేనే ఇష్టం అని చెపుతుంది.ఎందుకంటే దానితో నాకు చాల ఇమేజ్ వచ్చింది ఎంత ఇమేజ్ అంటే శోభాశెట్టిగా ఉన్న తన పేరు మోనితగా మారిపోయింది.
ఆ సీరియల్ క్యారక్టర్ పేరే నా రియల్ నేమ్ గా మారిపోయింది.కాబట్టి నాకు ఆ సీరియల్ అంటేనే చాల ఇష్టం అంటున్నారు మోనిత.తనకి సంబంధించి డ్రెస్సులు కానీ చెప్పులు కానీ ఇయర్రింగ్స్ కానీ అన్ని తనే డిజైన్ చేసుకుంటానని చెపుతుంది.అందుకే తను షాపింగ్ ఎక్కువగా చేస్తానని చెపుతుంది.
షూటింగ్ టైములో తన తోటి ఆర్టిస్ట్ లతో చాలా ఫ్రెండ్లీగా ఉంటానని కార్తీక్(నిరూపమ్) తనకి మంచి ఫ్రెండ్ అని సెట్లో ఆక్టింగ్ చేసేటపుడు తను నాకు కొన్ని సలహాలు కూడా ఇస్తాడని చెపుతుంది.ప్రేమివిశ్వనాథ్(వంటలక్క) కూడా తనకి మంచి ఫ్రెండ్ అని సెట్ లో ఫ్రీటైం దొరికితే మేము ఇద్దరం బాగా మాట్లాడుకుంటాం అని అల్లరి చేస్తాం అని కూడా చెపుతుంది.
అలాగే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి డిస్కస్ చేస్తామని కూడా చెపుతుంది.
మెయిన్ గా మా అమ్మ లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు అని అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అని చెపుతుంది.అలాగే హైదరాబాద్ బిర్యానీ అంటే కూడా తనకి చాలా ఇష్టం అని చెపుతుంది.నేను ఏ క్యారక్టర్ చేసిన నన్ను ఇంతలా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకి నేను జీవితాంతం ఋణపడి ఉంటానని ఆమె చాలాసార్లు చెప్పింది.
ఆమెకి లవ్ అంటే ఇష్టమే కానీ తను మాత్రం లవ్ చేసి ఇంట్లో పెద్దలని ఒప్పించి లవ్ అండ్ ఆరెంజ్ మ్యారేజ్ చేసుకుంటానని చెపుతుంది.ఆమెకి హీరోయిన్ గా చేయడం ఇష్టం కానీ నెగటివ్ క్యారక్టర్స్ ని కూడా తెలుగు జనాలు ఆదరిస్తున్న తీరు చూస్తే నాకు నెగటివ్ క్యారక్టర్సే చేయాలనీ ఉంది అని చెపుతుంది.
ఇండస్ట్రీకి రావడానికి తనకి ఇన్స్పిరేషన్ ఎవరు లేరు అని చెపుతుంది.ఎందుకంటే ఎవరినైనా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే మనకి తెలియకుండానే వాళ్ళ స్టైల్ మనకి వస్తుంది.కానీ ఇక్కడ ఇంకొకరి స్టైల్ మనం కాపీ కొట్టకూడదు.మనకంటూ సెపరేట్ స్టైల్ ఉండాలి అని చెపుతుంది.
తాను తెలుగు ప్రేక్షకులకి జీవితాంతం రుణపడి ఉంటానని కూడా చాలాసార్లు చెపుతుంది.