సూపర్ స్టార్ మహేష్ బాబు( Superstar Mahesh Babu ) కూతురు సితార( Sitara ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.2025 సంవత్సరం జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం.
అయితే మహేష్ బాబు డబ్బింగ్ చెప్పిన ముఫాసా : ద లయన్ కింగ్ ( Mufasa: The Lion King )ఈ నెల 20వ తేదీన థియేటర్లలో విడుదలవుతోంది.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన బుకింగ్స్ సైతం మొదలయ్యాయి.
ముఫాసా పాత్రకు మహేష్ బాబు డబ్బింగ్ చెప్పిన నేపథ్యంలో ఈ సినిమా కోసం ఘట్టమనేని ఫ్యాన్స్ ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.దాదాపుగా 2 గంటల నిడివితో ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతోంది.

సితార ముఫాసా : ద లయన్ కింగ్ గురించి మాట్లాడుతూ ముఫాసా తెలుగు వెర్షన్ కు నాన్న డబ్బింగ్ చెప్పడం చాలా గర్వంగా ఉందని అన్నారు.రియల్ లైఫ్ లో కూడా నాన్నకు ముఫాసాతో పోలికలున్నాయని చెప్పుకొచ్చారు.ఎందుకంటే నాన్న అంతలా ప్రేమిస్తారని అండగా ఉంటారని సితార పేర్కొన్నారు.నాన్న ఈ సినిమాకు డబ్బింగ్ చెబుతున్నారనే విషయం తెలియగానే సంతోషంగా అనిపించిందని సితార వెల్లడించారు.ముఫాసా పాత్రకు డబ్బింగ్ చెప్పేందుకు నాన్న చాలా ప్రాక్టీస్ చేశారని సితార కామెంట్లు చేశారు.ట్రైలర్ చూసిన ప్రతిసారి సినిమా ఎప్పుడు చూస్తానా అని అనిపించిందని సితార పేర్కొన్నారు.

హైదరాబాద్ లోని ప్రముఖ మల్టీప్లెక్స్( multiplex ) లలో రికార్డ్ స్థాయి షోలతో ఈ సినిమా విడుదలవుతోంది.త్రీడీ వెర్షన్ లో కూడా ఈ సినిమా విడుదలవుతూ ఉండటం గమనార్హం.పిల్లలను ఈ సినిమా ఆకట్టుకోవడం పక్కా అని చెప్పవచ్చు.బాక్సాఫీస్ వద్ద పుష్ప ది రూల్ హవా తగ్గడంతో కొత్త సినిమాల జోరు పెరిగింది.మరో 50 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంటే పుష్ప ది రూల్ బ్రేక్ ఈవెన్ అవుతుంది.