వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం ప్రతి యేటా వేలాది మంది భారతీయులు కెనడాకు వెళ్తుంటారు.వీరిలో అత్యధిక శాతం మంది పంజాబీలే.
దశాబ్ధాలుగా కెనడాతో( Canada ) వీరిది విడదీయరాని అనుబంధం.ఇలా వెళ్లే వారిలో క్రిమినల్స్ కూడా ఉండటం ఆందోళనకరం.
ఎన్నో పంజాబీ ముఠాలు( Punjabi gangs ) కెనడాను అడ్డాగా చేసుకుని భారత్‌లో నేర సామ్రాజ్యాలను విస్తరిస్తున్నాయి.కిరాయి హత్యలు, డ్రగ్స్, ఆక్రమ ఆయుధాలు, బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నాయి.
ఈ ముఠాల మధ్య ఆధిపత్య పోరు, ప్రతీకార దాడుల కారణంగా కెనడాలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి.

ఈ క్రమంలో 2019లో కెనడాలోని కాల్గరీలో ( Calgary )భారత సంతతికి చెందిన ఇద్దరిని హత్య చేసిన కేసులో ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు జీవిత ఖైదు విధించింది కోర్ట్.భారత సంతతికి చెందిన పాతికేళ్ల వయసున్న ఈ ఇద్దరు వ్యక్తులపై హత్య, తదితర అభియోగాలు మోపారు.ముఠా కక్షల కారణంగానే హత్యలు జరిగినట్లుగా తెలుస్తోంది.
యావజ్జీవ కారాగార శిక్ష పడిన వారిని జస్కరన్ సింగ్ సిద్ధూ, ప్రభజ్యోత భట్టిలుగా ( Jaskaran Singh Sidhu , Prabhajyota Bhatti )గుర్తించారు.తమ విచారణలో తప్పులు ఉన్నాయని పేర్కొంటూ ఇద్దరూ అప్పీల్ చేసుకున్నారు.
వీరిద్దరూ 25 ఏళ్ల తర్వాత పెరోల్‌కు అర్హులు.

మాదక ద్రవ్యాల స్మగ్లింగ్, ఇతర పాత కక్షల నేపథ్యంలో భారత సంతతికి చెందిన అమన్‌దీప్ సగ్గు( Amandeep ) ఆదేశాల మేరకు ఈ ఇద్దరిని హత్య చేశారు.2016లో తనపై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు సగ్గు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.కాల్గరీ హెరాల్డ్ ప్రకారం.
బాధితులిద్దరూ జస్దీప్ సింగ్, జప్నీత్ మల్హిలు డ్రగ్ డీలర్లు.మల్హి తన గర్ల్‌ఫ్రెండ్‌ను వదిలిపెట్టి బయటకు వస్తుండగా నిందితులు కాల్పులకు పాల్పడ్డారు.
ఈ ఘటనలో సింగ్, మల్హిలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.దాడి జరిగిన సమయంలో కారులోనే ప్రధాన సూత్రధారి సగ్గు ఉన్నట్లుగా తెలుస్తోంది.2016లో తనను కత్తితో పొడిచి చంపేందుకు ప్రయత్నించినందుకు ప్రతీకారంగానే ఈ హత్యలు ప్లాన్ చేసినట్లు సగ్గు తన నేరాన్ని అంగీకరించాడు.సీబీసీ న్యూస్ కథనం ప్రకారం… అతనికి దాదాపు 8 ఏళ్ల జైలు శిక్ష పడింది.