ఈ ఏడాది సెప్టెంబర్‌లో తూర్పు ఇంగ్లాండ్‌లోని లీసెస్టర్‌లో( Leicester, England ) 80 ఏళ్ల భారత సంతతి వ్యక్తి హత్య కేసులో 12 ఏళ్ల బాలికను పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది.లీసెస్టర్‌షైర్ పోలీసులు మాట్లాడుతూ.
మైనర్ అయినందున చట్టపరమైన కారణాల వల్ల బాలిక పేరు చెప్పలేమని తెలిపారు.నరహత్యకు పాల్పడిన అభియోగంపై లీసెస్టెర్‌షైర్ మేజిస్ట్రేట్ కోర్టులో ఆమెను హాజరుపరిచారు.
ఇక ఇదే కేసులో 15 ఏళ్ల బాలుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సెప్టెంబర్ 2న ఆసుపత్రిలో వృద్ధుడు మరణించిన తర్వాత 12-14 ఏళ్ల వయసు గల ఐదుగురు పిల్లలను అదుపులోకి తీసుకున్నారు.
మెడ భాగంలో తీవ్ర గాయం కారణంగానే భీమ్‌సేన్ కోహ్లీ( Bhimsen Kohli ) ప్రాణాలు కోల్పోయినట్లు పోస్ట్‌మార్టం పరీక్షలో తేలింది.అయితే దర్యాప్తులో మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు.
కోహ్లీ మరణం చుట్టూ ఉన్న పరిస్ధితులు తీవ్ర విషాదకరమైనవని, ఆయన కుటుంబ సభ్యులకు , స్నేహితులకు మాత్రమే కాకుండా సమాజానికి కూడా ఇవి కలత కలిగిస్తున్నాయని లీసెస్టర్‌షైర్ పోలీస్ విభాగం ఆవేదన వ్యక్తం చేసింది.

కాగా.ఈ ఏడాది సెప్టెంబర్‌లో పార్క్‌లో కుక్కను వాకింగ్ తీసుకొచ్చిన భీమ్ సేన్ కోహ్లీపై 14 ఏళ్ల వయసున్న బాలబాలికలు దాడికి దిగారు.తీవ్ర గాయాలతో పడివున్న పెద్దాయనను పోలీసులు ఆసుపత్రికి తరలించగా.
అక్కడ చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయాడు.బాధితుడి మరణం తర్వాత దీనిని హత్య కేసుగా మార్చినట్లు పోలీసులు తెలిపారు.
ఘటనకు ముందు ఏం జరిగిందో తెలుసుకోవడానికి స్థానికుల సహాయం కోరినట్లు చెప్పారు.

ఘటన సమయంలో బ్లాక్ జంపర్, గ్రే జాగింగ్ బాటమ్స్( Black jumper, gray jogging bottoms ) ధరించి తన పెంపుడు కుక్కును తీసుకెళ్తున్నాడు.ఈ క్రమంలో బాలురు ఆయనపై దాడి చేసి పారిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు.సాధ్యమైనంత సమాచారాన్ని రాబట్టడానికి స్థానికులతో మాట్లాడుతున్నారు.
ఘటనాస్థలి నుంచి మృతుడి ఇంటికి చేరుకోవడానికి 30 సెకన్లకు మించి సమయం పట్టదు.బాధితుడు చెట్టు కింద గాయాలతో పడి న్నాడని కోహ్లీ కుమార్తె చెప్పినట్లు లీసెస్టర్‌షైర్ లైవ్ పేర్కొంది.
దాదాపు 40 ఏళ్లుగా తాము ఇక్కడ నివసిస్తున్నామని.ఇటీవల ఈ ప్రాంతంలో సంఘ విద్రోహ ఘటనలు పెరిగాయని ఆమె తెలిపారు.
మృతుడు కోహ్లీకి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు.