సెలబ్రెటీలు చేసే ఐస్ బాత్ గురించి తెలుసా.. ఈ స్నానం చేస్తే నిమిషాల్లో ఒంటి నొప్పులు దూరం..!

సాధారణంగా చెప్పాలంటే ఫ్రిజ్ లోనీ మంచి నీరు అనుకోకుండా మీద పడితేనే ఒక్కసారిగా ఉలిక్కిపడుతూ ఉంటారు.చలికాలంలో చల్లని నీటితో స్నానం చేయడం అంటే చాలా మంది భయపడిపోతున్నారు.

 Do You Know Why Celebrities Take Ice Baths Details, Celebrities Ice Baths, Ice B-TeluguStop.com

అయితే బాత్ నిండా ఐసు గడ్డలు వేసుకుని, అందులో కూర్చోవడం అంటే వింటుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది.కానీ ఇలా చేస్తే స్ట్రెస్ వల్ల వచ్చే నొప్పులు ( Pains ) దూరం అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఐస్‌ బాత్‌( Ice Bath ) అని పిలిచే ఇలాంటి స్నానాన్ని చాలామంది ప్రొఫెషనల్ అథ్లెట్లు, అలాగే ఫిట్‌నెస్ ఫ్రీక్స్ శరీరానికి త్వరగా రికవరీ అయ్యేందుకు ఉపయోగపడుతుంది.

ఈ మధ్యకాలంలో శకుంతలంతో ప్రేక్షకులను పలకరించిన హీరోయిన్ సమంత( Samantha ) కూడా తన ఇంస్టాగ్రామ్ లో ఐస్ బాత్ చేస్తున్న ఫోటోను షేర్ చేసింది.ప్రస్తుతం సీటాడెల్‌ యాక్షన్ సీక్వెన్స్ ల కోసం సమంత భారీ వర్కవుట్‌లు చేస్తోంది.దీని వలన వచ్చే స్ట్రెస్ నుంచి త్వరగా కోలుకోవడానికి ఐస్ బాత్ చికిత్సను సమంత ఆశ్రయించింది.

ఇది టార్చర్ సమయం అంటూ ఆమె పోస్ట్ చేసిన చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే కొత్తగా చేసే వాళ్ళు కేవలం 15 నిమిషాల్లో ఐస్ టాప్ లోంచి వచ్చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఐస్ బాత్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఐస్ బాత్ చేయడం వల్ల శరీరంలో వచ్చే వాపును త్వరగా తగ్గించుకోవచ్చు.ఎక్కువసేపు వ్యాయామం చేసిన తర్వాత కండరాల పునరుద్ధరణ లో ఐస్ బాత్ ఎంతగానో ఉపయోగపడుతుంది.అంతేకాకుండా చల్లని ఐస్ గడ్డల స్నానం చేయడం వల్ల మీ రక్తనాళాలు కుంచించుకుపోయి చిన్నదివిగా తయారవుతాయి.

మీరు బయటకు వచ్చిన వెంటనే ఉష్ణోగ్రతలో మార్పు వల్ల రక్త నాళాలలో రక్తం వేగంగా తిరగడానికి సహాయపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube