`గ్రీన్ టీ` విష‌యంలో అస్స‌లు చేయ‌కూడ‌ని పొర‌పాట్లు ఇవే

ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్యధికంగా సేవించే పానియాల్లో గ్రీన్ టీ ఒక‌టి.ముఖ్యంగా వెయిట్ లాస్ అయ్యేందుకు ప్ర‌య‌త్నిస్తున్న వారు ఖ‌చ్చితంగా త‌మ డైట్‌లో గ్రీన్ టీను చేర్చుకుంటారు.

 These Are The Mistakes That Should Not Be Made At All In The Case Of `green Tea`-TeluguStop.com

వెయిట్ లాస్ ఒక్క‌దానికే కాదు.ఆరోగ్యాన్ని పెంచ‌డానికి, అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను నివారించ‌డానికి, అందాన్ని పెంచ‌డానికి గ్రీన్ టీ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

అయితే ఎన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్న‌ప్ప‌టికీ.గ్రీన్ టీ విష‌యంలో కొన్ని కొన్ని పొర‌పాట్లు అస్స‌లు చేయ‌కూడ‌దు.

మ‌రి ఆ పొర‌పాట్లు ఏంటీ.? అవి ఎందుకు చేయ‌కూడ‌దు.? వంటి విష‌యాల‌ను లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

సాధార‌ణంగా చాలా మంది తెలిసో, తెలియ‌క‌నో చేసే పొర‌పాటు ఉద‌యం ప‌రిగ‌డుపున గ్రీన్ టీని తీసుకోవ‌డం.

కానీ, ఖాళీ క‌డుపుతో గ్రీన్ టీ తీసుకోవ‌డం ఎంతో ప్ర‌మాద‌క‌రం.ప‌రిగ‌డుపున గ్రీన్ టీని సేవించ‌డం వ‌ల్ల జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో పాటుగా మూత్రవిసర్జనలోనూ సమస్యలు ఏర్పడతాయి.

అలాగే భోజ‌నానికి ముందు లేదా భోజ‌నం చేసిన త‌ర్వాత గ్రీన్ టీని ఎట్టి ప‌రిస్థితుల్లో తీసుకోరాదు.ఎందుకంటే, అలా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ధ‌కం, అజీర్తి, గ్యాస్ వంటి స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌తాయి.భోజ‌నం చేయ‌డానికి గంట ముందు లేదా గంట త‌ర్వాత గ్రీన్ టీ తాగవచ్చు.

కొంద‌రు రాత్రి నిద్రించ‌డానికి ముందు గ్రీన్ టీ తీసుకుంటారు.అయితే ఇక‌పై మాత్రం ఇలా తీసుకోకండి.రోజూ రాత్రుళ్లు గ్రీన్ టీ తాగితే క్ర‌మంగా నిద్ర లేమి స‌మ‌స్య‌కు దారి తీస్తుంది.

గ్రీన్ టీని పగటి పూట, సాయంత్రం మాత్రమే తాగాలి.

ఇక ఆరోగ్యానికి మంచిది క‌దా అని గ్రీన్ టీని అతిగా కూడా తీసుకో రాదు.

ఒక రోజులో మూడు కప్పుల కంటే ఎక్కువగా గ్రీన్ టీని సేవిస్తే గ‌నుక‌ వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి ఇలా ర‌క ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి.కాబ‌ట్టి, గ్రీన్ టీతో జర జాగ్ర‌త్త‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube