వెండితెరపై ఎంతో మంది హీరోయిన్లు రాణించారు.చాలా మంది మంచి నటీమణులుగా గుర్తింపు పొందారు.
కొందరు చాలా ఏళ్ల పాటు వెండితెరను ఏలారు.తర్వాత వారికున్న ఇమేజ్ తో రాజకీయాల్లోనూ రంగప్రవేశం చేశారు.
కొందరు రాజకీయ కుటుంబాలకు కోడళ్లుగా వెళ్లారు.కొందరు ముఖ్యమంత్రులుగా.
కొందరు ముఖ్యమంత్రుల భార్యలుగా.కొందరు సీఎంల ఇంటికి కోడళ్లుగా వెళ్లారు.
కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు గా ప్రజల మధ్య తిరుగుతూ వారి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తున్నారు.
ముఖ్యమంత్రుల విషయంలోకి వస్తే.
గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు జయలలిత.వెండితెరపై రారాణిగా వెలిగిన జయలలిత.అంతే క్రేజ్ తో రాజకీయాల్లోనూ సక్సెస్ అయ్యారు.నిజంగా చెప్పాలంటే.ఆమెకు రాజకీయాల్లో తిరుగులేదు.అమ్మగా తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని రెండు సార్లు అధిరోహించారు.
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు.జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నారు.
వాటంన్నింటిని అవలీలగా తిప్పికొట్టారు.రాజకీయాల్లో ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేశారు.
తమిళనాడులో ఒకసారి ఒక పార్టీ వస్తే… రెండోసారి వేరే పార్టీ అధికారంలోకి వచ్చేవి.కానీ జయలలిత మాత్రం వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి పీఠం ఎక్కి ఆ ఆనవాయితీని బ్రేక్ చేశారు.
జయలలిత రాష్ట్రంలో తెచ్చిన పథకాలతో ఇప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
మన మాజీ ప్రధాని దేవేగౌడ కుటుంబంలో మరో హీరోయిన్ ఉన్నారనే విషయం చాలా మందికి తెలియదు.కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య రాధిక కూడా ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన వ్యక్తే.కన్నడ పరిశ్రమలో రాధిక అందరికీ సుపరిచితురాలే.ఆమె నటిగా, నిర్మాతగా వ్యవహరించారు.2006లో ఆమె కుమారస్వామిని పెళ్లాడారు.వీరికి ఓ కూతురు ఉంది.రాధికా కుమారస్వామి 2002లో నీల మేఘ శ్యామతో కన్నడ సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు.తొమ్మిదో తరగతి చదవగానే సినీ ఫీల్డులోకి అడుగుపెట్టారు.ప్రస్తుతం ఆమె మాజీ ముఖ్యమంత్రి భార్య హోదాలో ఉన్నారు.
మన తెలుగు హీరోయిన్ జెనీలియా కూడా మాజీ ముఖ్యమంత్రి కుటుంబంలోకి కోడలిగా వెళ్లిందనే విషయం చాలా మందికి తెలియదు.జెనీలియా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషాల్లో హీరోయిన్ గా మంచి పాత్రలు చేసింది.2003లో హిందీలో వచ్చిన తుఝే మేరీ కసమ్ సినిమాలో జెనీలియా, రితేశ్ దేశ్ ముఖ్ హీరో, హీరోయిన్లుగా పరిచయమయ్యారు.అదే సమయంలో వారిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది.
తెలుగులో సత్యం సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాలు చేసింది.తర్వాత రితేశ్ దేశ్ ముఖ్ ని పెళ్లి చేసుకుని మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్ కోడలిగా స్థిరపడిపోయింది.
హీరోయిన్ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా కూడా మాజీ ముఖ్యమంత్రి ఇంటికి కోడలుగా వెళ్లనుంది.మాజీ ముఖ్యమంత్రి మనవడుని వివాహం చేసుకోబోతోంది.హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనవడుని పెళ్లాడనుంది.కాంగ్రెస్ నేత ఆడంపూర్ ఎమ్మెల్యే కుల్ దీస్ బిష్ణోయ్ కొడుకు భవ్య బిష్ణోయ్ తో మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతుంది.
మార్చ్ 13 న రాజస్థాన్ లోని జోధ్ పూర్ విల్లా ప్యాలెస్ లో ఇద్దరి ఎంగేజ్ మెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.కొన్ని రోజుల క్రితం ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు.
అదే పరిచయం ప్రేమగా మారి పెళ్లి పీటలెక్కబోతున్నారు.ఇలా మన హీరోయిన్లు ముఖ్యమంత్రులుగా.
ముఖ్యమంత్రుల ఇళ్లకు కోడళ్లుగా లక్కీ ఛాన్స్ కొట్టేశారు.