తెలుగు ప్రేక్షకులకు నటుడు సత్యరాజ్( Actor Sathyaraj ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సత్యరాజ్ అంటే చాలామంది గుర్తుపట్టకపోవచ్చు కానీ బాహుబలి( Baahubali ) సినిమాలో కట్టప్ప( Kattappa ) అంటే చాలు ఇట్టే గుర్తు పట్టేస్తారు.
అంతలా గుర్తింపు తెచ్చుకున్నారు సత్యరాజ్.ఇండియాలోనే సూపర్ పాపులర్ యాక్టర్ కాకుండా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఒకప్పుడు తమిళ సినిమా ఇండస్ట్రీలో ఒక దుమ్ము దులిపారు అని చెప్పాలి.కానీ ప్రస్తుతం వయస్సు పై బడటంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ అయ్యారు.
తెలుగులో ఆయన్ను ఒరిజినల్ పేరుతో.కంటే కట్టప్ప అని పిలిస్తేనే గుర్తుపడతారు.
బాహుబలి సినిమాలో కట్టప్పగా ఆయన విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్నారు.ఆ తర్వాత ఆయనకు చాలా ప్రాధాన్యత ఉన్న పాత్రలు దక్కుతూ వస్తున్నాయి.

ముఖ్యంగా హీరోలకు తండ్రి పాత్రల్లో ఆయన చక్కగా ఒదిగిపోతారు.అయితే సత్యరాజ్ కేవలం సినిమాలలో తప్పితే మీడియా, సోషల్ మీడియాలో పెద్ద యాక్టివ్ గా కనిపించరు.ఇక ఆయన వ్యక్తిగత జీవితం గురించి కూడా చాలామందికి తెలీదు.సత్యరాజ్ ఫ్యామిలీ విషయానికి వస్తే.భార్య మహేశ్వరి, ఒక తనయుడు, కుమార్తె ఉన్నారు.ఇప్పటికే సత్యరాజ్ కొడుకు సిబిరాజ్( Sibiraj ) ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు.
డోరా, మాయోన్ వంటి చిత్రాల్లో నటించి తన ప్రతిభ చాటుకున్నాడు.ఇక ఆయన కుమార్తె పేరు దివ్య సత్యరాజ్.
( Divya Sathyaraj ) ప్రస్తుతం దివ్య సత్య రాజ్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ షాక్ అవుతున్నారు.ఇండస్ట్రీకి దూరంగా ఉండే దివ్య న్యూట్రిషనిస్ట్ గా పని చేస్తోంది.

అంత స్టార్ యాక్టర్ కూతురు అయినప్పటికీ ఆమె మీడియాలో పెద్దగా కనిపించదు.సోషల్ మీడియాలో మాత్రం చురుగ్గా ఉంటుంది.ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆరోగ్యం, జీవనశైలిపై నెటిజన్లకు సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటుంది.దీంతో ఆమెకు ఫాలోవర్స్ సంఖ్య బాగా ఉంది.ఇక దివ్య ఫోటోలు లేటెస్ట్‌గా చూసిన నెటిజన్స్.ఆమెది హీరోయిన్ కు ఏ మాత్రం తీసిపోని అందం అంటూ ప్రశంసిస్తున్నారు.
ఎంతమంది ఏంటి ఈమె కట్టప్ప కూతురా అంటూ షాక్ అవుతున్నారు.