సందీప్ రెడ్డివంగా (Sandeep Reddy Vanga)దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్లాయి.ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేస్తున్నాయి.
మరి ఇలాంటి సందర్భంలో ఆయన స్పిరిట్ సినిమా చేస్తూ ముందుకు సాగుతున్నాడు మరి షారుక్ ఖాన్(Shahrukh Khan) లాంటి స్టార్ హీరో సైతం సందీప్ రెడ్డి వంగ తో ఒక సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.కానీ సందీప్ రెడ్డి వంగ మాత్రం ఆయనతో సినిమా చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించడం లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
అలాగే బాలీవుడ్ హీరోల( Bollywood heros) కంటే కూడా తెలుగు హీరోల వైపే ఆయన ఎక్కువగా మొగ్గు చూపుతున్నాడు.నిజానికి ఆనిమల్(Animal) కథని కూడా మహేష్ బాబు (Mahesh Babu)రిజెక్ట్ చేయడం వల్ల ఆ సినిమాని రన్బీర్ కపూర్ (Ranbir Kapoor)తో చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు.ఇక బాలీవుడ్ వాళ్లను డామినేట్ చేస్తూ మనవాళ్లు ముందుకు రావాలి అంటే మాత్రం మన హీరోలతో సినిమాలు చేసి సూపర్ సక్సెస్ సాధించాల్సిన అవసరం అయితే ఉంది.
ఏది ఏమైనా భారీ విజయాన్ని సాధిస్తే మాత్రం సందీప్ రెడ్డి వంగ మరోసారి పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకుంటాడు.ఇక స్పిరిట్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టడమే కాకుండా 2500 కోట్ల కలెక్షన్లు రాబట్టాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఇప్పటికి ఆ కథను చాలా రగ్గడ్ గా తీయబోతున్నట్టుగా తెలుస్తోంది.
మరి అలాంటి కథను సందీప్ రెడ్డివంగా ఎలా డీల్ చేస్తాడు.ప్రభాస్ ని ఎలా చూపిస్తాడు అనేది తెలియాల్సి ఉంది… మరి ఈ సినిమా తర్వాత కూడా ఆయన స్టార్ హీరోలతోనే సినిమాలు చేసే అవకాశం ఉంది…
.