అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) మరికొద్దిరోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు.అసలే ట్రంప్ టెంపరితనానికి పెట్టింది పేరు .
అందుకు తగినట్లుగానే ఆయన దూకుడు నిర్ణయాలపై ప్రపంచం ఓ కన్నేసి ఉంచింది.అమెరికాకు( America ) పొరుగున ఉండే కెనడాను( Canada ) తమ దేశంలో 51వ రాష్ట్రంగా మారుస్తామంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో( Canada PM Justin Trudeau ) డొనాల్డ్ ట్రంప్ భేటీ అయ్యారు.
ఈ క్రమంలోనే మీ దేశం నుంచి వలసలను, డ్రగ్స్ అక్రమ రవాణాను కట్టడి చేయాలని, లేనిపక్షంలో 25 శాతం పన్నులు పెంచుతానని ట్రంప్ హెచ్చరించారు.
ఈ విషయంలో విఫలమైతే అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాలని బెదిరించారు.అంతేకాదు.
ట్రూడోను ఏకంగా గవర్నర్ ఆఫ్ కెనడా అంటూ వ్యాఖ్యానించడంతో రెండు దేశాలతో పాటు ప్రపంచ దేశాల్లో కలకలం రేపింది.అయితే ప్రజల దృష్టిని మరల్చేందుకే ట్రంప్ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యానించారు.
తాజాగా మరోసారి ట్రంప్‌కు హెచ్చరికలు పంపేందుకు జస్టిన్ ట్రూడో ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.ఒకవేళ కెనడాపై ట్రంప్ సుంకాలు విధిస్తే.తాము కూడా అమెరికా ఎగుమతులపై( US Exports ) పన్నులు విధించాలని ట్రూడో భావిస్తున్నట్లుగా సీఎన్ఎన్ కథనాన్ని ప్రసారం చేసింది.సిరామిక్స్, స్టీల్, ఫర్నిచర్, ఆల్కహాలిక్ పానీయాలు, నారింజ రసం, పెంపుడు జంతువుల ఆహారం వంటివి ఉన్నాయి.
అలాగే అమెరికాకు చేసే ఇందన ఎగుమతులపైనా పన్ను విధించాలని కెనడా యోచిస్తున్నట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
కెనడా విదేశాంగ మంత్రి మెలనీ జోలీ( Canadian Foreign Minister Melanie Jolie ) మాట్లాడుతూ.మనం సిద్ధంగా ఉండాలని అన్నారు.అయితే ప్రతీకారంగా అమెరికాపై విధించే సుంకాలపై తుది నిర్ణయం తీసుకోలేదని మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ట్రంప్ బెదిరింపుల దృష్ట్యా కెనడా ప్రయోజనాలను కాపాడటానికి ప్రతి నిమిషం అంకితం చేయాల్సిన అవసరం ఉందని జోలి అన్నారు.