ఏంది భయ్యా అది.. ఆవునో, గొర్రెనో తోలినట్లుగా సింహాన్ని తరిమికొట్టావ్‌గా!

సింహాలు( lions ) అత్యంత క్రూరమైనవి.వాటి ముందుకు వెళ్తే అవి చంపడం ఖాయం కానీ గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలో ( Bhavnagar district of Gujarat ) ఎవరూ ఊహించని ఒక సంఘటన చోటుచేసుకుంది.

 What's The Matter It Drove Away The Lion Like A Cow Or A Sheep, Forest Guard, Li-TeluguStop.com

దానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.ఇందులో ఓ ఫారెస్ట్ గార్డ్ సింహాన్ని రైలు పట్టాలపై నుంచి భయమెరగకుండా తరిమికొట్టాడు.

జనవరి 6న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో లిలియా రైల్వే స్టేషన్ ( Lilia Railway Station )సమీపంలోని ఎల్‌సీ-31 గేటు వద్ద ఈ ఘటన జరిగింది.

వీడియోలో సింహం రైలు పట్టాలు దాటుతుండగా ఫారెస్ట్ గార్డ్‌ను గమనించింది.అయినా బెదరకుండా ఆ గార్డ్ చేతిలో కర్ర పట్టుకుని సింహం దగ్గరికి వెళ్లాడు. ఆ సింహాన్ని ఆవునో, గొర్రెనో తోలినట్లుగా తరిమికొట్టాడు.

ఆ సింహం కూడా పెద్దగా స్పందించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది.ఆ దృశ్యం చూసిన వారంతా నోరెళ్ల బెడుతున్నారు.

రైల్వే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శంభుజీ ఈ ఘటన నిజంగానే జరిగిందని వెల్లడించారు.గుజరాత్‌లో చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో సింహాల భద్రత కోసం అటవీ, రైల్వే శాఖలు అప్రమత్తంగా ఉన్నాయని ఆయన తెలిపారు.

ఈ గార్డ్ ధైర్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.కొందరు ఆయన్ని “రియల్ లయన్” అంటూ పొగుడుతుంటే, మరికొందరు మాత్రం ఇంత దగ్గరగా వన్యప్రాణుల వద్దకు వెళ్లడం ప్రమాదకరమని విమర్శిస్తున్నారు.ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.ఇప్పటికే 3 వేలకు పైగా లైకులు, కొన్ని లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.ఈ ఘటన విపత్కర పరిస్థితుల్లోనూ వన్యప్రాణులను రక్షించేందుకు అటవీ అధికారులు ఎంతగా కృషి చేస్తున్నారో తెలియజేస్తోంది.అయితే, వన్యప్రాణులతో వ్యవహరించేటప్పుడు తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై కూడా చర్చకు దారితీస్తోంది.

ఎందుకంటే ఇలాంటి చర్యలు ఒక్కోసారి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.వన్యప్రాణులను పట్టాలపై నుంచి తొలగించేందుకు సురక్షితమైన మార్గాన్ని కనిపెట్టాల్సిన అవసరం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube