అమెరికా : వర్జీనియా చట్టసభకు ఇద్దరు భారత సంతతి నేతల ఎన్నిక!

అమెరికా రాజకీయాల్లో భారతీయుల ప్రాబల్యం పెరుగుతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే మేయర్లుగా, గవర్నర్లుగా, కాంగ్రెస్ సభ్యులుగా, మంత్రులుగా భారతీయులు సేవలందిస్తున్నారు.

 Two Indian Americans Elected To Virginia State Legislatures Details, Indian Amer-TeluguStop.com

ఇక నిన్న మొన్నటి వరకు ఉపాధ్యక్షురాలిగా సేవలందించిన కమలా హారిస్ భారత మూలాలున్న వ్యక్తి కావడం గమనార్హం.అధ్యక్ష రేసులో నిలిచిన ఆమె తృటిలో ఆ అత్యున్నత పదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే.

తాజాగా వర్జీనియా శాసనసభకు( Virginia Legislature ) జరిగిన ప్రత్యేక ఎన్నికల్లో ఇద్దరు భారతీయ అమెరికన్లు ఎన్నికయ్యారు.గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో జాతీయ స్థాయిలో ట్రంప్( Trump ) గాలి బలంగా వీచినప్పటికీ డెమొక్రాటిక్ పార్టీ వర్జీనియాలో మాత్రం స్వల్ప మెజారిటీతో సత్తా చాటింది.

బుధవారం నాడు కన్నన్ శ్రీనివాసన్( Kannan Srinivasan ) రాష్ట్ర సెనేట్‌కు, జేజే సింగ్( JJ Singh ) రాష్ట్ర ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు.రాష్ట్ర సెనేట్‌కు రాజీనామా చేసి నవంబర్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికైన సుహాస్ సుబ్రహ్మణ్యం( Suhas Subramanyam ) స్థానంలో శ్రీనివాసన్ విజయం సాధించారు.

ఆయన ప్రతినిధుల సభలో అడుగుపెట్టి హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీతపై ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే.

Telugu Democratic, Donald Trump, Jj Singh, Virginia, White-Telugu NRI

మరో భారతీయ అమెరికన్ .హైదరాబాద్‌లో పుట్టిన గజాలా హష్మీత్ కలిసి సెనేట్‌లో కార్యకలాపాలు సాగించనున్నారు.తమిళనాడులో పెరిగిన శ్రీనివాసన్.

అమెరికాకు వలస వెళ్లే ముందు భారతదేశంలో చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేశాడు.అమెరికాలో బిజినెస్ అండ్ ఫైనాన్స్ రంగాల్లో దాదాపు 30 ఏళ్ల అనుభవం ఆయన సొంతం.

శ్రీనివాస్ 2023లో తొలిసారిగా వర్జీనియా హౌస్‌కు ఎన్నికయ్యారు.

Telugu Democratic, Donald Trump, Jj Singh, Virginia, White-Telugu NRI

ఇక ప్రతినిధుల సభకు జరిగిన ఎన్నికల్లో భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి వెంకటాచలంపై జేజే సింగ్ విజయం సాధించారు.వర్జీనియాలోనే జన్మించిన ఆయన అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో వైట్‌హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్‌లో పనిచేశారు.జేజే సింగ్ గతంలో బొలీవియాలో పీస్ కార్ప్స్ వాలంటీర్‌గా, యూఎస్ సెనేట్ సీనియర్ సలహాదారుగానూ సేవలందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube