సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందిన తర్వాత ఎంతోమంది ఈ సోషల్ మీడియాని ఉపయోగించుకొని స్టార్స్ గా మారిపోయారు .అలా సోషల్ మీడియా ద్వారా గుర్తింపు పొంది ప్రస్తుతం ఇండస్ట్రీలో సెలబ్రిటీగా కొనసాగుతున్న వారిలో వైవాహర్ష( Viva Harsha ) ఒకరు.
ఈయన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించారు. అనంతరం షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ తన కామెడీ ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు.
ఇక వైవా అనే షార్ట్ ఫిలిం ద్వారా హర్షకు ఎంతో మంచి పేరు రావడంతో ఈయన పేరు ఏకంగా వైవా హర్షగా మారిపోయింది.ఇక ప్రస్తుతం హర్ష సినిమాలలో హీరో ఫ్రెండ్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.
ఇటీవల ఈయన ప్రధాన పాత్రలో సుందరం మాస్టర్( Sundaram Master ) అనే సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇలా నిత్యం ఎన్నో ఫన్నీ వీడియోలు ద్వారా ప్రేక్షకులను మెప్పిస్తున్న వైవాహర్ష తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ వీడియో షేర్ చేశారు.ప్లీజ్ ఎవరైనా సహాయం చేయండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ అందరిని సహాయం అడుగుతున్నటువంటి ఈ వీడియో వైరల్ అవుతుంది.ఇలా ఈయన అందరిని రిక్వెస్ట్ చేయడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే…
హాయ్ అండి అందరికీ నేను మీ అందరిని ఒక సహాయం అడగడం కోసమే ఈ వీడియో చేశానని తెలిపారు .ఏదైనా ఒక సమస్య పక్కవారికి వస్తే మనకు పెద్దగా తెలియదు కానీ మన వరకు వస్తే మాత్రం ఎంతో బాధపడుతాము.అలాంటి ఒక పరిస్థితిలో నేను, నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఉన్నాము.
మా అంకుల్ ఏ.పాపరావు. ఆయన వయసు 91 ఏళ్ల అంకుల్‌కి అల్జీమర్స్( Alzheimers ) ఉంది.గత నాలుగు రోజుల క్రితం ఆయన ఇంటి నుంచి వెళ్లిపోయారు.ఆయన్ను చివరి సారిగా కంచరపాలెం ఏరియాలో. కనిపించారు.
అదీ కూడా రెండు రోజుల క్రితం ఓ సీసీ టీవీ ఫుటేజ్‌లో కనిపించారు దయచేసి ఆ ఏరియాలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఫాలోవర్స్ ఎవరైనా కనుక అతను కనిపిస్తే వెంటనే ఈ వీడియోలో కనిపించే నెంబర్ కి అడ్రస్ కి ఇన్ఫామ్ చేయండి అలాగే అతను కనిపించగానే కాస్త తనకు అన్నం పెట్టండి తాను చాలా నీరసంగా కనిపిస్తున్నారు అంటూ హర్ష ఎమోషనల్ అవుతూ షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతుంది.