Dry Hair : ఎంత ఖరీదైన కండీషనర్ వాడిన జుట్టు డ్రై అవ్వడం ఆగట్లేదా.. అయితే ఇది ట్రై చేయండి!

మనలో కొందరి హెయిర్ చాలా సిల్కీగా మరియు షైనీ గా మెరిసిపోతూ కనిపిస్తుంటుంది.కానీ కొందరి హెయిర్ మాత్రం ఎప్పుడు డ్రై గా, నిర్జీవంగా ఉంటుంది.

 Try This Natural Remedy For Repairing Dry Hair 2-TeluguStop.com

ఇలాంటివారు జుట్టును తేమ గా ఉంచుకోవడం కోసం నానా అవస్థలు పడుతుంటారు.ఖరీదైన కండీషనర్, సీరం తదితర ఉత్పత్తులను వాడుతుంటారు.

అయినా సరే జుట్టు డ్రై( Dry hair ) అయిపోతూ ఉంటుంది.దాంతో ఏం చేయాలో తెలియ‌క‌ తీవ్ర ఆందోళనకు లోనవుతుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే రెమెడీ మీకు చాలా బాగా సహాయపడుతుంది.

కండీషనర్ కంటే బెటర్ గా ఈ రెమెడీ పర్ఫార్మ్ చేస్తుంది.ఇది మీ జుట్టుకు సహజ తేమను అందిస్తుంది.డ్రై హెయిర్ సమస్యకు చెక్ పెడుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో త్వరగా తెలుసుకుందాం పదండి.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక అరటి పండుకు( Banana fruit ) స్లైసెస్ గా కట్ చేసి వేసుకోవాలి.అలాగే ఒక బాగా పండిన అవకాడో ( Avocado )నుంచి పల్ప్ ను సపరేట్ చేసుకొని వేసుకోవాలి.

మరియు పావు కప్పు ఫ్రెష్ అలోవెరా జెల్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Telugu Dry, Care, Care Tips, Healthy, Remedy, Silky, Smooth, Naturalremedy-Telug

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో ఒక ఎగ్ వైట్( Egg white ) మరియు వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్( Vitamin E oil ) వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

Telugu Dry, Care, Care Tips, Healthy, Remedy, Silky, Smooth, Naturalremedy-Telug

అరటిపండు, అవకాడో, అలోవెరా, గుడ్డు మరియు విటమిన్ ఈ ఆయిల్.ఇవన్నీ సహజంగానే మీ జుట్టుకు తేమను అందిస్తాయి.కురులు సిల్కీగా షైనీ గా మెరిసేలా ప్రోత్సహిస్తాయి.డ్రై హెయిర్ సమస్యకు అడ్డుకట్ట వేస్తాయి.వారానికి ఒకసారి ఈ మాస్క్ ను వేసుకున్నారంటే డ్రై హెయిర్ అన్న మాటే అనరు.అలాగే ఈ హెయిర్ మాస్క్ మూలాల నుంచి జుట్టును బలోపేతం చేస్తుంది.

జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.మరియు జుట్టును ఆరోగ్యంగా ఒత్తుగా మారుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube