Dry Hair : ఎంత ఖరీదైన కండీషనర్ వాడిన జుట్టు డ్రై అవ్వడం ఆగట్లేదా.. అయితే ఇది ట్రై చేయండి!
TeluguStop.com
మనలో కొందరి హెయిర్ చాలా సిల్కీగా మరియు షైనీ గా మెరిసిపోతూ కనిపిస్తుంటుంది.
కానీ కొందరి హెయిర్ మాత్రం ఎప్పుడు డ్రై గా, నిర్జీవంగా ఉంటుంది.ఇలాంటివారు జుట్టును తేమ గా ఉంచుకోవడం కోసం నానా అవస్థలు పడుతుంటారు.
ఖరీదైన కండీషనర్, సీరం తదితర ఉత్పత్తులను వాడుతుంటారు.అయినా సరే జుట్టు డ్రై( Dry Hair ) అయిపోతూ ఉంటుంది.
దాంతో ఏం చేయాలో తెలియక తీవ్ర ఆందోళనకు లోనవుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.
? అయితే ఇప్పుడు చెప్పబోయే రెమెడీ మీకు చాలా బాగా సహాయపడుతుంది.కండీషనర్ కంటే బెటర్ గా ఈ రెమెడీ పర్ఫార్మ్ చేస్తుంది.
ఇది మీ జుట్టుకు సహజ తేమను అందిస్తుంది.డ్రై హెయిర్ సమస్యకు చెక్ పెడుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో త్వరగా తెలుసుకుందాం పదండి.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక అరటి పండుకు( Banana Fruit ) స్లైసెస్ గా కట్ చేసి వేసుకోవాలి.
అలాగే ఒక బాగా పండిన అవకాడో ( Avocado )నుంచి పల్ప్ ను సపరేట్ చేసుకొని వేసుకోవాలి.
మరియు పావు కప్పు ఫ్రెష్ అలోవెరా జెల్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
"""/" /
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో ఒక ఎగ్ వైట్( Egg White ) మరియు వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్( Vitamin E Oil ) వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
"""/" /
అరటిపండు, అవకాడో, అలోవెరా, గుడ్డు మరియు విటమిన్ ఈ ఆయిల్.
ఇవన్నీ సహజంగానే మీ జుట్టుకు తేమను అందిస్తాయి.కురులు సిల్కీగా షైనీ గా మెరిసేలా ప్రోత్సహిస్తాయి.
డ్రై హెయిర్ సమస్యకు అడ్డుకట్ట వేస్తాయి.వారానికి ఒకసారి ఈ మాస్క్ ను వేసుకున్నారంటే డ్రై హెయిర్ అన్న మాటే అనరు.
అలాగే ఈ హెయిర్ మాస్క్ మూలాల నుంచి జుట్టును బలోపేతం చేస్తుంది.జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
మరియు జుట్టును ఆరోగ్యంగా ఒత్తుగా మారుస్తుంది.